ఒకవైపు దోస్తీ అంటూనే… టారీఫ్‌లు అమలు

ట్రంప్‌ చేతలకు, చేష్టలకు పొంతన ఉండదని మరోమారు రుజువు చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం భారత్‌కు దూరమయ్యాం అంటూనే, భారత్‌తో చెలిమిని వదులుకోలేమనం చెబుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అంతలోనే మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్దమయ్యారు. రష్యా నుంచి చౌకగా ఆయిల్‌ను కొనుగోలు చేస్తుందన్న నెపంతో కక్షకట్టి భారత్‌పైనే సుంకాలను విధిస్తూ వస్తున్నది. ఈ సుంకాల విధింపు తరువాత భారత్‌ వేగంగా మేల్కొని ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో ఇక్కడ తయారైన వాటిని ఇక్కడే కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇటీవల రష్యా ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున దాడులు చేసింది. సుమారు 802 డ్రోన్లు, 13 క్షిపణులను ప్రయోగించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా మరోమారు ఇండియాపై టారిఫ్‌ బాదుడుకు సిద్దమైంది. ఆగస్టు 27 వ తేదీన 25 శాతం టారీఫ్‌లు అమలులోకి రాగా, ఈ వారంలోనే రెండో విడత టారిఫ్‌లు అమలు కాబోతున్నాయి. అమెరికా టారిఫ్‌లను అమలు చేసినప్పటికీ తమకు ఇబ్బందులు లేవని భారతీయ నిపుణులు చెబుతున్నారు. టారిఫ్‌లు విధించడం వలన భారత్‌ కంటే కూడా అమెరికాకే నష్టం ఎక్కువని, భారత్‌ నుంచి చౌక ధరకు దిగుమతి ఆ దేశానికి ఆగిపోతుందని అంటున్నారు. ఇప్పటికే పోస్టల్‌ సర్వీసులను నిలిపివేయగా, మరికొన్ని రంగాలు కూడా అదే బాట పట్టనున్నాయి.

ఉక్రెయిన్‌ రష్యా మధ్య యుద్ధం ఆగాలంటే రష్యా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాలని, ఆర్థిక పరిస్థితులు దిగజారాలంటే ఆ దేశం నుంచి వస్తువులు, ఆయిల్‌ వంటివాటిని కొనుగోలు చేయరాదని ట్రంప్‌ చెబుతున్నాడు. కానీ, ఇండియా తమకు లాభం చేకూరే, తమ ప్రజలకు ఉపయోగపడే విధంగా, చిన్న, మధ్యతరగతి రైతులకు అందుబాటులో ఉండే ధరలకు ఆయల్‌ ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం తమ ధర్మమని, తమకు ఎక్కడ తక్కువ ధరకు ఆయిల్ దొరికితే అక్కడే కొనుగోలు చేస్తామని మరోసారి స్పష్టం చేసింది. ఇప్పుడు ట్రంప్‌ పూర్తిస్థాయిలో 50 శాతం మేర టారిఫ్‌లను పెంచడంతో సంబంధాలు ఎటువైపుకు దారితీస్తాయో అని ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *