భవిష్యత్తులో రైలుపై నుంచే మిస్సైల్స్‌ ప్రయోగం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత రక్షణ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్వయం సమృద్ధిని సాధించేందుకు భారత్‌ శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో దిగుమతులను తగ్గించుకొని స్వదేశీ ఉత్పత్తులపై ఆధారపడుతోంది. మనకు కావలసిన రక్షణ వ్యవస్థను స్వయంగా తయారు చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రక్షణ శాఖ కోసం డీఆర్‌డీవో సంస్థ ఎన్నో రకాలైన క్షిపణులను తయారు చేసింది. రాకెట్‌ లాంచింగ్‌ వ్యవస్థలను సరళీకృతం చేస్తూ వచ్చింది.

తాజాగా రక్షణ వ్యవస్థలో మరో వినూత్న ప్రయోగానికి తెరలేపింది. 2 వేల కిలోమీటర్ల రేంజ్‌ లక్ష్యాలను చేధించే విధంగా అగ్ని ప్రైమ్‌ ఇంటర్మీడియట్‌ మిస్సైల్‌ను తయారు చేశారు. అయితే, ఇక్కడ విశేషమేమంటే ఈ అగ్ని ప్రైమ్‌ మిస్సైల్‌ను భూమి మీదనుంచి కాకుండా రైలు మీదనుంచి ప్రయోగించే విధంగా రాకెట్‌ లాంచర్‌ను డెవలప్‌ చేశారు. రైలు నుంచి అగ్ని ప్రైమ్‌ మిస్సైల్స్‌ను డీఆర్డీఓ విజయవంతంగా పరిక్షీంచింది.

రైలు నుంచి రాకెట్‌ నిప్పులు చెరుగుతూ ఆకాశంలోకి దూసుకుపోయింది. రాకెట్‌ లాంచర్లను రైళ్లలో ఇన్‌స్టాల్‌ చేసి, రాకెట్లను కూడా భద్రపరిచి అవసరమైనపుడు ప్రయోగించే విధంగా వ్యవస్థను డెవలప్‌ చేస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైళ్లు ప్రయాణికులను, గూడ్స్‌ను, రక్షణ వాహనాలను తీసుకెళ్లేవి. భవిష్యత్తులో రైళ్లు కూడా అవసరమైతే నేరుగా యుద్ధరంలోకి దిగి మిస్సైళ్లు ప్రయోగించవచ్చని తెలుస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *