సూపర్ కృష్ణ ఫామిలీ నుంచి ఇద్దరు కొత్త స్టార్స్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే… కృష్ణ గారి కూతురు మంజుల కూతురు జాన్వీ ఒక ఆభరణాల యాడ్ లో కనిపించి క్యూట్ గా అనిపించింది. ఇక ఇప్పుడు కృష్ణ గారి కొడుకు రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతని ఫస్ట్ సినిమాని RX 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రేపే లాంచ్ చేయబోతున్నట్టు అజయ్ ట్విట్టర్ ద్వారా న్యూస్ షేర్ చేసి ఘట్టమనేని ఫాన్స్ ని ఖుష్ చేసాడు…
ఈ సినిమాలో రవీనా టాండన్ కూతురు ‘రాష తాడని’ నటిస్తుండగా… తనకి కూడా ఇది ఫస్ట్ సినిమానే! ఇక ఈ కొత్త స్టోరీ ని ప్రెసెంట్ చేస్తున్నది అశ్విని దత్ ఐతే ప్రొడ్యూస్ చేస్తున్నది జెమినీ కిరణ్ అది కూడా ‘చందమామ కథలు’ బ్యానర్ పైన… సో, మంచి కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు…