వైభవోపేతంగా శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మ ఉయ్యాల కంబాల ఉత్సవం

ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం రాత్రి వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా, భాజభజంత్రీల నడుమ జరిగింది. గర్భగుడిలో ఉన్న అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆలయ అనువంశిక పూజారి బంటుపల్లి వెంకటరావు స్వహస్తాలతో ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. ఆలయం బయటే ఆలయ అదికారులు ఏర్పాటు చేసిన ఉయ్యాల చుట్టూ ముమ్మారు ప్రదిక్షణలు చేసారు. అనంతపురం శ్రీశ్రీ శ్రీ పైడితల్లిని ఉయ్యాల లో కూర్చోబెట్టి… కాస్సేపు ఉయ్యాలను ఊపారు. ఈ కార్యక్రమం మొత్తం దేవాలయ ఆలయ ఈఓ శిరీష ఆధ్వర్యంలో జరుగగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ పోలీసులు, ఎస్టీఎఫ్ లు బందోబస్త్ నిర్వహించారు.కార్యక్రమానికి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *