గుడ్‌న్యూస్ః మధ్యప్రదేశ్‌లో భారీ బంగారం గనులు

మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌ సమీపంలో జీఎస్‌ఐ సంస్థ బంగారం గనులను గుర్తించింది. జీఎస్‌ఐ సర్వే ఫలితాల ఆధారంగా సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో లక్షల టన్నుల బంగారం ఉన్నట్టుగా తెలియజేసింది. త్వరోనే దీని సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని జీఎస్‌ఐ స్పష్టం చేసింది. ఈ బంగారు గనుల ఆవిష్కరణతో స్థానిక, జాతీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊరట లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

భూగర్భ సర్వే నిర్వహించిన పరిశోధనల ప్రాకం, ఈ ప్రాంతంలో విస్తరించిన బంగారం గనులు ఏ స్థాయిలో ఉన్నాయో సంక్షిప్త నివేదికను సమర్పిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఈ గనులు తవ్వడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు భారత ప్రభుత్వం సహకరిస్తుందని జీఎస్ఐ ఆశాభావం వ్యక్తం చేసింది. అదే జరిగితే భారత్‌లో బంగారం ఉత్పత్తి సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. ప్రతి ఏడాది భారత్‌ పెద్ద సంఖ్యలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు జబల్పూర్‌లో ఉత్పత్తి ప్రారంభమైతే, దిగుమతి కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది, స్థానికంగా అభివృద్ధికి ఈ బంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పరిశోధనలు చేస్తుంది. ఖనిజాల పరిశోధనను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా బంగారం గనులపై పరిశోధనలను పెంచేలా చర్యలు తీసుకుంది. ఈ విషయంలో అవసరమైన శాస్త్ర, సాంకేతికను ఉపయోగించేందుకు కూడా భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఒడిశాలో కూడా పెద్ద ఎత్తున బంగారం గనులను జీఎస్‌ఐ గుర్తించగా, ఇప్పుడు జబల్పూర్‌లో కూడా బంగారం గనులు బయటపడటం విశేషం. పర్యావరణ పరిరక్షణ, స్థానిక వనరులకు ఇబ్బందులు లేకుండా తవ్వకాలు చేపట్టేందుకు భారత్ చర్యలు తీసుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *