గుణశేఖర్ EUPHORIA టీజర్ వచ్చేసిందోచ్…

గుణశేఖర్ ఎప్పుడూ యూత్, ఎమోషన్, విజువల్స్‌ని తనదైన స్టైల్‌లో చూపించే దర్శకుడు. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘యూఫోరియా’ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది. మొదట ఈ మూవీని 2025 క్రిస్మస్ రిలీజ్‌గా ప్లాన్ చేశారు. కానీ అదే రోజున మరో మంచి సినిమాలు కూడా రావడంతో క్లాష్ రావొద్దని భావించిన మేకర్స్, రిలీజ్ డేట్‌ని మార్చేశారు.

ఈరోజు మేకర్స్ ఒక స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తూ కొత్త రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించారు. యూత్ ఎమోషన్స్, వారి మైండ్‌సెట్, వారి tech వరల్డ్‌ని చూపించే షాట్స్‌తో ఈ టీజర్ పక్కా గుణశేఖర్ మార్క్‌తో నిండి ఉంది. టీజర్‌లో గౌతమ్ మీనన్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తూ కథలో ఉన్న ఇంటెన్సిటీకి హింట్ ఇచ్చాడు. అలాగే యువతలో డ్రగ్స్, వారి మైండ్‌లో నడిచే కన్‌ఫ్యూషన్స్… ఈ రోజుల్లో ఉన్న కాంటెంపరరీ ఇష్యూలపై సినిమా సాగబోతుందనే క్లూ క్లియర్‌గా అందింది.

డ్రగ్స్‌కు సంబంధించిన షాకింగ్ విజువల్స్, ట్రిప్పీ బ్యాక్‌డ్రాప్ ఈ టీజర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. చివర్లో… “ఫిబ్రవరి 6, 2026” అని రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.

ఈ సినిమాను నీలిమ గుణ ఇంకా యుక్త గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాగిణి గుణ ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, ఇప్పుడొచ్చిన ఈ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే మరో పెద్ద అప్‌డేట్ ఇవ్వాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

ఈ మూవీ ద్వారా విగ్నేష్ గవిరెడ్డి తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. అలాగే భూమికా చావ్లా ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఆమెతో పాటు సారా అర్జున్, నజర్, రోహిత్ మరియు మరికొంతమంది ప్రతిభావంతమైన కొత్త ముఖాలు—
లిఖిత యలమంచిలి, అడాల ప్రభుదిరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్ ఇంకా మరికొంతమంది నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *