శ్రీరాముడి జననంపై కేపీ ఓలి సంచలన వ్యాఖ్యలు

నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన అన్నారు

“అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడని నేను వ్యతిరేకించాను కాబట్టే అధికారాన్ని కోల్పోయాను. నా స్వభావం కొంచెం మొండితనంగా ఉంటుంది. రాముడు భారత్‌లో కాదు, నేపాల్‌లోనే జన్మించాడని నేను ఎప్పటికీ నమ్మాను. లిపులేఖ్ సమస్యను కూడా నేను బహిరంగంగా లేవనెత్తాను.”నేను ఆ అంశాలపై రాజీ పడివుంటే అధికారంలో చాలా కాలం ఉండేవాడిని. కానీ నేను వాస్తవాలపై నిలబడ్డాను. నేను పారిపోలేదు, ఇంకా ఇక్కడే నేపాల్‌లోనే ఉన్నాను.” అన్నారు.

భారత్‌పై వ్యతిరేక ధోరణి

ఓలి గతంలో కూడా అనేకసార్లు భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాముడి జన్మస్థలం అయోధ్య కాదని, అది నేపాల్‌లోని థోరి ప్రాంతంలోనే ఉందని ఆయన పలు సందర్భాల్లో చెప్పడం వివాదాలకు దారితీసింది.అలాగే భారత్–నేపాల్ సరిహద్దు వివాదాస్పద ప్రాంతమైన లిపులేఖ్, కలాపానీ, లింపియాధురా ప్రాంతాలను నేపాల్‌లో భాగంగా ప్రకటించడం ద్వారా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడ్డాయి.

ఓలి వ్యాఖ్యలపై విశ్లేషణ

ఓలి వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శకులు అంటున్నారు.రామజన్మభూమి–అయోధ్య అంశాన్ని తాకి భారత్‌లోని భావోద్వేగాలను ప్రేరేపించడం ఆయన లక్ష్యమని చెబుతున్నారు.నేపాల్‌లోని కొన్ని జాతీయవాద వర్గాలకు ఈ వ్యాఖ్యలు నచ్చినా, అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఆయన నమ్మకాన్ని దెబ్బతీశాయని విశ్లేషకుల అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *