భగవంతుడు చెప్పిన నాలుగు మంచిమాటలు

ఈ సృష్టిలో ఏదీ కూడా మనకు సులభంగా లభించదు. ఒకవేళ అలా లభిస్తే అది మనవద్ద నిలవదు. మనం ఏం చేసినా అది భగవంతుడు ఇచ్చింది అనుకొని చేయాలి. మనం ఏం మాట్లాడినా అది ఆ భగవంతుడు మనచేత పలికిస్తున్నదని అనుకొని మాట్లాడాలి. నాలుగు మంచిమాటలు విన్నప్పుడు మన మనసు కాస్త కుదుటపడుతుంది. భగవంతుడు మనకోసం చెప్పిన నాలుగు మాటలు తెలుసుకుందాం.

చేతిలో గీతలు అరిగితే గాని, నుదుటి మీద రాసిన రాతలు మారవు.

విలువైన వాటిని భగవంతుడు మనకు ఇచ్చేటప్పుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే వాటి విలువ మనకు తెలియాలి కాబట్టి.

డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వారు చాలామంది ఉంటారు. జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు కూడా ఎవరూ ఉండరు. కాబట్టి నీకోసం కొంత దాచుకో.

చిమ్మచీకట్లో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మనం బాధలో ఉన్నప్పుడు మన ఆత్మీయులు ఇచ్చే చిన్న ఓదార్పు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది.

జీవితంలో పదిమందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు. పదిమంది బాధను తీర్చి ఎదగడం గొప్ప.

ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా ఇష్టంతో చేయి.

నిన్నటి కంటే రేపు బాగుండాలి. రోజును మించి రోజు సాగాలి. దిగులు నీడలు తాకకూడదు. జీవితం ఆనందమయం కావాలి.

బంగారం మన ఒంటి మీద ఉన్నంత సేపే విలువ ఇస్తుంది. కానీ సంస్కారం మన జీవితానికి నిరంతరం విలువనిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *