సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల్లో మేజర్ షూట్ జరుగుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకొచ్చింది. రాజమౌళి, మహేష్ బాబు–ప్రియాంక చోప్రా జంటపై ఒక స్పెషల్ ఫోక్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట! ఈ పాటకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, డ్యాన్స్ స్టెప్స్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం కంపోజ్ చేయనున్నారు.

రాజమౌళి మహేష్ బాబు ని ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువచ్చేలా ఉన్నారు. ప్రియాంక చోప్రా అద్భుతమైన డ్యాన్సర్ కాబట్టి, ఇద్దరూ కలిసి ఈ ఫోక్ సాంగ్‌లో డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్‌కి పక్కా ట్రీట్ అవుతుంది.
అయితే ఈ డ్యాన్స్ నెంబర్‌పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. వచ్చే నెల జరగబోయే ప్రెస్ మీట్‌లో టీం దీనిపై మాట్లాడే అవకాశం ఉందట.
కె.ఎల్. నారాయణ ఈ భారీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్ మీద అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి!