మెస్సీ వర్సెస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రపంచంలో అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ప్లేయర్లలో ఒకరు మెస్సీ. అర్జంటైనా క్రీడాకారుడైన మెస్సి ఇప్పుడు హైదరాబాద్‌ రాబోతున్నారు. డిసెంబర్‌ 13 హైదరాబాద్‌కు వస్తున్న మెస్సీ తెలంగాణ సీఎంతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. క్రీడాస్పూర్తి…తెలంగాణ కీర్తి పేరుతో ఫుట్‌బాల్‌ గేమ్‌ను ఆడనున్నారు. డిసెంబర్‌ 13వ తేదీన మెస్సీతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి ఫుట్‌బాల్‌ గేమ్‌ ఆడనున్నారు. దీనికోసం సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఎంసీ హెచ్‌ఆర్డీ మైదానంలో తన టీమ్‌తో కలిసి సాధన చేస్తున్నాడు.

దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. సీఎం రేవంత్‌ క్రీడాస్పూర్తిని రాష్ట్ర ప్రజలు అభినందిస్తున్నారు. తెలంగాణ రైజింగ్‌ 2047లో భాగంగా ఉప్పల్‌ వేదికగా జరిగే క్రీడావేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచన నేపథ్యంతో క్రీడామైదానంలోకి స్వయంగా దిగినట్టు సీఎం తెలిపారు. సీఎం చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. మరి సీఎం రేవంత్‌ వర్సెస్‌ మెస్సీ గేమ్‌లో విజేత ఎవరో…ఏ జట్టు ఎన్ని గోల్స్‌ చేస్తుందో చూడాలి. మెస్సి బాల్‌తో చేసే మాయాజాలం ఏవిధంగా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *