క్యాబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన మంత్రులు

•తమ నియోజకవర్గ గ్రామాల్లోని రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడంపై డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలిపిన మంత్రులు


•గత ప్రభుత్వంలో విధ్వంసమైన రోడ్లతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారని… ఆ రోడ్లు ఇప్పుడు బాగుపడతాయని, ప్రజల తరపున తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని డిప్యూటీ సీఎంకు చెప్పిన మంత్రులు


•పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీమతి అనిత, నారాయణ, నాదెండ్ల మనోహర్, శ్రీమతి సవిత, శ్రీ డి వి బి స్వామి, శ్రీ రామానాయుడు, శ్రీ సత్య అనగాని, శ్రీ రాంప్రసాద్ రెడ్డి, శ్రీ జనార్దన్, కందుల దుర్గేష్…


•మొదటి విడతగా పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణలకు నిధులు మంజూరు చేస్తూ ఇప్పటికే జీవో జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ.


•మొత్తంగా 157 నియోజకవర్గాల్లో 1299 రోడ్ల పటిష్టత చేపట్టనున్న పంచాయతీ రాజ్ శాఖ.


•రూ. 2123 కోట్ల మేర సాస్కీ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ.


•26 జిల్లాల పరిధిలోని 157 నియోజకవర్గాల్లోని 4007 కిలో మీటర్ల మేర రోడ్లను పటిష్టపరిచేలా మొదటి విడతలో కార్యాచరణ.

•పల్లె పండుగ 2.0 పేరిట చేపట్టే రహదారి నిర్మాణాలకు ఉప ముఖ్యమంత్రివర్యులు ఇటీవలే శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *