బెంగాల్‌లో బీజేపీ నేతలపై దాడులు… ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని

ఇటీవలే పశ్చిమబెంగాల్‌ను వరదలు ముంచెత్తాయి. వరదలతో పాటు భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో దాదాపు 28 మంది మృతి చెందారు. ఈ వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలోనే జల్పైగురి జిల్లాలోని నాగ్రాకట ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపి ఖగెన్‌ ముర్ము, ఎమ్మెల్యే డాక్టర్‌ శంకర్‌ ఘోష్‌లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు.

ప్రశాంతంగా సిరిమానోత్సవం

బీజేపీ నేతలు వెళ్లిన సమయంలో అక్కడి స్థానికులు సుమారు 500 మంది బీజేపీ నేతల వాహనాలపై దాడులు చేశారు. రాళ్లు, కర్రలతో చేసిన ఈ దాడిలో బీజేపీ ఎంపి, ఎమ్మెల్యే, ఇతర నాయకులు గాయడపడ్డారు. దీంతో వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కర్రలతో దాడి చేసిన నేపథ్యంలో ముర్ము తలకు బలమైన గాయాలు అయినట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే, స్థానికుల కథనం ప్రకారం ప్రభుత్వం సహాయక చర్యలు ఆలస్యం కావడం వలనే ప్రజలు ఆగ్రహంతో ఈ దాడి చేశారని చెబుతున్నా… దీని వెనుక అధికార టీఎంసీ పార్టీ హస్తం ఉందని, వారి ప్రోద్భలంతోనే కొందరు అమాయక ప్రజల మధ్యలోకి దూరి దాడులు చేశారని, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందని నేతలు చెబుతున్నారు.

ఇక ఈ దాడిపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దాడి వెనుక ఎవరి హస్తమున్నా వారిపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని టీఎంసీ ప్రభుత్వాన్ని కోరారు. దాడులు చేస్తున్నా తమ పర్యటనలు ఆగిపోవని, ప్రజల తరపున గొంతుక వినిపిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రజలు నిజం తెలుసుకునే వరకు తమ పోరాటం ఆగదని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *