టాలీవుడ్ యాక్ట్రెస్ ప్రగతి గురించి మన అందరికి తెలిసిందే… తాను చాల సినిమాల్లో కనిపించి, అమ్మ గా, పిన్ని గా, అత్త గా, చాల పాత్రల్లో పెద్ద తెర మీద మెరిసింది. తాజాగా ప్రగతి దేశం గర్వించేలా ఆసియన్ ఓపెన్ గేమ్స్ 2025లో పవర్ లిఫ్టింగ్ లో నాలుగు మెడల్స్ సాధించి, శబాష్ అనిపించుకుంది… నిన్నే తనకి టాలీవుడ్ తరపున సన్మానం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు ప్రగతి ఫిట్నెస్ ఇంకా ధైర్యాన్ని మెచ్చుకుని అభినందించారు…
అలాగే AP MLC నాగ బాబు కూడా ట్విట్టర్ ద్వారా ప్రగతి కి అభినందనలు తెలిపారు…
“అరుదైన విజయం సాధించిన శ్రీమతి ప్రగతి గారికి అభినందనలు. ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్-2025లో” నాలుగు మెడల్స్ గెలుచుకున్న సినీనటి శ్రీమతి ప్రగతి గారికి అభినందనలు. నటనతో పాటు పవర్ లిఫ్టింగ్లోనూ అంతర్జాతీయస్థాయిలో రాణించడం అనేకమందికి స్ఫూర్తిదాయకం. ప్రగతి గారు చీరకట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేయడం గతంలో ఒకసారి గమనించాను “ఇదేంటి చీరకట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేస్తోంది, సరదాకేమో..” అనుకున్నాను. ఇంత నిబద్ధతగా ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తుందని ఊహించలేదు. వెండితెరపై మెప్పిస్తూ, క్రీడారంగంలోనూ రాణించడం విశేషం, చాలామంది మహిళలకు ఆదర్శం. ప్రగతి గారు సినిమాలతో పాటుగా పవర్ లిఫ్టింగ్లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ.. -శ్రీ కె. నాగబాబు
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.”

ప్రగతి సంధించిన విజయం అద్భుతం అందరికి స్ఫూర్తిదాయకం కూడా… ఎన్ని విమర్శలు ఎదురైనా తానూ అనుకున్నది చేసి చూపించింది!