వృషకర్మ గా నాగ చైతన్య…

ఈరోజు అక్కినేని ఫాన్స్ కి పండగే… మన కింగ్ నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య పుట్టిన రోజు కాబట్టి… అందుకే నిన్నటి నుంచే అతని నెక్స్ట్ సినిమా మీద బజ్ గట్టిగా ఉంది… ఈసారి నాగ చైతన్య ‘విరూపాక్ష’ తో మంచి హిట్ కొట్టిన కార్తీక్ తో జత కట్టాడు… ఈరోజు పుట్టిన రోజు సందర్బంగా మహేష్ బాబు ఈ సినిమా టైటిల్ ని లాంచ్ చేసాడు…

ఇంతకీ టైటిల్ డైరెక్టర్ కార్తీక్ మెచ్చిన నచ్చిన కలసి వచ్చిన ‘V’ తో నే మొదలయ్యే ‘వృషకర్మ’ … కార్తీక్ తన టైటిల్స్ అన్ని సంస్కృత భాషలోంచి తీస్తాడు.

అయితే, ఈ అప్‌డేట్‌ను ప్రత్యేకంగా మార్చింది సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు. చైతుకి బర్త్‌డే విషెస్‌తో పాటు, వృషకర్మ టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్‌ను ఆయనే సోషల్ మీడియా లో విడుదల చేశారు.

బలం, న్యాయం, ధర్మం… అదే ‘వృషకర్మ’… టైటిల్ బాగుంది కదూ!

దర్శకుడు కార్తిక్‌కు ‘V’ సెంటిమెంట్‌, సంస్కృతం పట్ల ఆసక్తి తెలిసిందే. ఆ ప్రయాణంలోనే ఈసారి కూడ ‘వృషకర్మ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ తీసుకొచ్చారు. ‘ధర్మపరుడు, నీతిమంతుని చేతిలోనే నిజమైన కార్యసిద్ధి’ అనే అర్థాన్ని ఈ పేరు సూచిస్తుంది. ఇదే చైతన్య పాత్ర లక్ష్యం కూడా.

ఇక చైతన్య పోస్టర్ లో రాడ్ చేతిలో పట్టుకొని, భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. ఈ పాత్ర కోసం నాగ చైతన్య చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం.

ఈ సినిమా ని SVCC ఇంకా సుకుమార్ రైటింగ్స్‌ బ్యానర్లపై BVSN ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సెట్స్‌పై షూటింగ్ జరుపుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *