బాలయ్య సినిమా వస్తుందంటే మనలో చాల మంది TV లకి అతుక్కుపోతాం కదా… ఇప్పటి నరసింహ రెడ్డి, సమరసింహా రెడ్డి, భైరవ ద్వీపం, ఆదిత్య 369 ఇలా అయన ప్రతి సినిమా మనకి స్పెషల్ కదా…
ఐతే ఇప్పుడు అఖండ 2 తో ఇంకో పది రోజుల్లో మళ్ళి మన ముందుకు రాబోతున్నాడు బాలయ్య… ఈ సినిమా బోయపాటి డి కాబట్టి, పైగా సీక్వెల్ కాబట్టి, చాల హైప్ ఉంది. అలాగే ట్రైలర్ లో కూడా బాలయ్య అఘోరి రూపం లో చేసే ఫైట్స్, చెప్పే డైలాగ్స్ సూపర్. చూసి తీరాల్సిందే…
ఇక ఈ సినిమా అలా రిలీజ్ అవ్వబోతోందో లేదో, ఇలా కొత్త సినిమా లాంచ్ జరిగిపోయింది… ఇది అయన 111 వ సినిమా. సో, దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా లాంచ్ విషయాన్ని షేర్ చేస్తూ, అనౌన్స్మెంట్ పోస్టర్ షేర్ చేసాడు. ఇందులో బాలయ్య రెండు రూపాల్లో కనిపించాడు.
ఒక దాంట్లో రుద్రాక్ష మాల వేసుకుని కింగ్ గా, ఇంకో దాంట్లో సైనికుడి లా కనిపించాడు… ఈ సినిమా లో నయనతార హీరోయిన్ కాగా, సతీష్ కిలారు వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై సినిమాని నిర్మిస్తున్నారు. ఈరోజు ముహూర్తం షాట్ తీయడం జరిగింది…
అలాగే ఈ పెద్ద న్యూస్ ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ దర్శకుడు గోపీచంద్, తన అందాన్ని నెటిజన్స్ ఇంకా బాలయ్య ఫాన్స్ తో పంచుకున్నాడు.