దసరా సందర్భంగా నాని – సుజీత్ కొత్త సినిమా లాంచ్

మన టాలీవుడ్ స్టార్ హీరో నాని, పవన్ కళ్యాణ్ OG ఫేమ్ దర్శకుడు సుజీత్ తో ఒక కొత్త సినిమా చేయబోతున్నాడు. దసరా శుభదినాన ఈ సినిమా ని ఆఫీసియల్ గా లాంచ్ చేసారు… ఈ ఈవెంట్ కి విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై మొదటి క్లాప్ కొట్టారు. అలాగే నాని తో గతంలో సినిమాలు చేసిన దర్శకులు రాహుల్ సంకృత్యాన్, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, రామ్ జగదీష్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్ట్ ని మొదట #BloodyRomeo అనే టైటిల్ తో 2024 ఏప్రిల్ లో DVV ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ బడ్జెట్ ఇష్యూల కారణంగా ఆ బ్యానర్ వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఈ సినిమాని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ – యునానిమస్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించబోతున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత వెంకట్ బోయనపల్లి, ఇంతకుముందు నాని నటించిన ‘శ్యామ్ సింఘా రాయ్’ సినిమాని హిట్ గా అందించిన సంగతి తెలిసిందే.

సినిమా డార్క్ కామెడీ తో పాటు సుజీత్ స్టైల్ యాక్షన్ తో కూడిన ఎంటర్‌టైనర్ గా ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం నాని చేస్తున్న The Paradise సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాని 2026 చివరిలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. నటీనటులు, టెక్నీషియన్ల పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *