జనరల్ గా సినిమా ప్రమోషన్స్ లో హీరో హీరోయిన్ కనిపించడం చూస్తాం… కానీ మన లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం సినిమా షూటింగ్ వరకే ఉంటుంది, ప్రమోషన్స్ లో పాల్గొనదు అని అందరు అంటారు… అలాగే చిరు సినిమా మన శంకర వర ప్రసాద్ ప్రమోషన్స్ లో కూడా నయన్ ఉండదు అనుకున్నాం… కానీ స్టార్టింగ్ లోనే హీరోయిన్ ఇంట్రడక్షన్ వీడియో చేసి సూపర్ అనిపించింది. తరవాత ఎక్కడ కనిపించలేదు!
కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దెగ్గరపడడం తో మళ్ళి గట్టిగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు అనిల్ రావిపూడి టీం… కానీ మళ్ళి స్టార్టింగ్ లోనే నయన్ ని తీసుకువచ్చి గట్టి షాక్ ఇచ్చాడు!
అందుకే ఇప్పుడు అందరు “సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతారను ప్రమోషన్లకు తీసుకొచ్చిన సినిమా ఏదంటే… మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’” అని అంటున్నారు!
దర్శకుడు అనిల్ రావిపూడి వేసిన మాస్టర్ ప్లాన్‌కి నయనతార మొదట్లోనే ఓకే చెప్పడంతో, ఈ సినిమా ప్రమోషన్లలో ఆమె యాక్టివ్‌గా పాల్గొంటుండటం అందరికీ ఆశ్చర్యంగా మారింది.
ఇటీవల విడుదలైన కొత్త ప్రోమోలో నయనతార…
“మీ ప్లాన్ ఏంటి డైరెక్టర్ గారు?” అంటూ సరదాగా ప్రశ్నించగా, ఆ క్షణం మొత్తం సెట్లో నవ్వులు పూయించింది. అదే సమయంలో సినిమా జనవరి 12న వరల్డ్‌వైడ్ రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు. సో, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది!
ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు, ‘మీసాల పిల్ల’, ‘శశిరేఖ’ – చిరు నయన్ కాంబినేషన్ అదరహో అన్నట్టు ఉన్నాయ్! ఇక న్యూ ఇయర్ ముందు వచ్చిన మూడో సింగిల్ ‘మెగా వెంకీ మాస్ సాంగ్’ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.
మొత్తానికి, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మెగాస్టార్ మార్క్ మాస్ వినోదంతో, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న సినిమా అని ఈ ప్రమోషన్లతో మరోసారి స్పష్టమైంది.