థియేటర్స్ లో ఆది సాయి కుమార్ శంభాల హవా…

న్యూ ఇయర్ ఈవ్ అయినా కూడా తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమకు బ్రేక్ పడలేదు. సెలవుల మూడ్ ఉన్నప్పటికీ థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయాయి. టికెట్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా సాగాయి.

క్రిస్మస్ సందర్బంగా విడుదలైన తెలుగు సినిమాల్లో ఆది సాయి కుమార్ ‘శంభాల’ న్యూ ఇయర్ కి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. బుక్‌మైషోలో ఈ సినిమాకు 47 వేల టికెట్లు బుక్ కావడం విశేషం. అదే సమయంలో విడుదలైన ఇతర సినిమాలతో పోలిస్తే ఇది భారీ లీడ్ అని చెప్పాలి. సోషల్ మీడియాలో వస్తున్న పాజిటివ్ టాక్ శంభాలకి బాక్సాఫీస్ వద్ద బలమైన ఆధిక్యాన్ని నిలబెట్టింది.

ఇక రోషన్ చాంపియన్ సినిమా 17.35 వేల టికెట్లు, అఖండ 2 సినిమా 15.54 వేల టికెట్లు బుక్ చేసుకుంది. నంబర్స్ లో వెనుకబడినప్పటికీ, అఖండ 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. ఈ ఆసక్తి రాబోయే రోజుల్లో స్థిరమైన థియేటర్ రన్ గా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికీ సంక్రాంతి భారీ సినిమాల రాక కి వన్ వీక్ గ్యాప్ ఉండటంతో, పోటీ తక్కువగా ఉండటం శంభాలకి కలిసొచ్చే అంశం. ఓపెన్ స్క్రీన్స్, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా రాబోయే కొన్ని రోజులు కూడా ఈ సినిమా తన ఆధిక్యాన్ని కొనసాగించవచ్చని ట్రేడ్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అయితే పండగ భారీ సినిమాలు రంగంలోకి దిగిన తర్వాత ఈ ఊపు ఎంతకాలం కొనసాగుతుందన్నదే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కీలక ప్రశ్నగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *