శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ పరిధిలో కొబ్బరి రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఆ సమావేశం ముఖ్యాంశాలు:

•డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం, కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం డ్రెయిన్ పొంగి పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు. కొబ్బరి తోటల్లోకి నీరు చొచ్చుకురావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శంకరగుప్తం డ్రెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది? ఆక్రమణలు ఏమైనా ఉన్నాయా? నీరు ఎంత కాలం పొలాల్లో ఉంటుంది? తదితర వివరాలపై ఆరా తీశారు. అనంతరం కొబ్బరి రైతులతో భేటీ అయ్యారు . రైతుల సమస్యలు ఓపికగా విన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

•కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.

•కోనసీమ కొబ్బరి రైతుల సమస్యకు 40 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తాము.. సంక్రాంతి తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తో మీ ముందుకు వస్తాము.

•కోనసీమ పరిధిలో లక్ష ఎకరాల పరిధిలో సాగవుతున్న కొబ్బరి తోటలపై లక్ష కుటుంబాల ఆధారపడి ఉన్నాయి. వారి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తాం.

•కోనసీమ రైతాంగానికి గొంతుకనవుతా.. వారి సమస్యలు పరిష్కరించే గళాన్ని అవుతా.

•మాటలు చెప్పి వెళ్లేందుకు కాదు. కోనసీమ కొబ్బరి రైతుకు అండగా ఉన్నామని చెప్పేందుకే ఇక్కడికి వచ్చా.

•నీటిపారుదల శాఖ నిపుణులు శ్రీ రోశయ్య గారు కోనసీమ కొబ్బరి రైతు సమస్యలపై, ఇక్కడి డెల్టా గురించి రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని అధ్యయనం చేసి అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి.

•రెండు వారాల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యపై అధికారులు, రైతులతో మరోసారి సమావేశం నిర్వహిస్తాం.

•కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం అని మాటిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *