ప్రభాస్ బర్త్డే సందర్బంగా సర్ప్రైజ్ కి రెడీ గా ఉండండి…

మన రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు రేపే కదా… కానీ, ఈసారి సంబరాలు ముందుగానే ఈరోజే మొదలయ్యాయి! దీపావళి పండగ సందర్భంగా ఆయన నటిస్తున్న హాను రాఘవపూడి సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా, అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇక నేడు విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ మాత్రం మరింత హైప్‌ క్రియేట్ చేసింది. రేపు రాబోయే టైటిల్ పోస్టర్‌పై ఆతృతను రెట్టింపు చేసింది.

ఈ ప్రీ లుక్‌లో బ్రిటిష్ కాలం నాటి వాతావరణం కనిపిస్తోంది. దేశభక్తి, గూఢచారి వైబ్ సూపర్ గా ఉంది. ఈ పోస్టర్ లో ప్రభాస్ తీరు సీక్రెట్ RAW ఏజెంట్ లా ఉంది. ఆయన లుక్‌కి తోడు పోస్టర్‌పై కనిపించే కోట్స్ మొత్తం ఆ మూడ్‌ని మరింత గంభీరంగా మార్చాయి.

బ్యాక్‌డ్రాప్‌లో నిశ్శబ్దంగా నడుస్తున్న సైనికులు, ఇంకా “A Battalion Who Walks Alone”, “Most Wanted Since 1932” అనే టాగ్ లైన్స్ చూస్తే — ఒంటరిగా నడిచిన యోధుడి కథ అని స్పష్టమవుతోంది. ఆ పోస్టర్‌లో ఉన్న సంస్కృత శ్లోకాలు దానికి ఒక ఆధ్యాత్మిక, శక్తివంతమైన వైభవం తీసుకొచ్చాయి.

ప్రభాస్ కొత్త లుక్‌తో, పవర్‌ఫుల్ థీమ్‌తో వచ్చిన ఈ ప్రీ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అభిమానులు టైటిల్ పోస్టర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తుండగా, ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *