స్పిరిట్… ఈ మోస్ట్-అవైటెడ్ సినిమా నిన్ననే అధికారికంగా లాంచ్ అయ్యింది అది కూడా మన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా. సుమారు రెండు ఏళ్ళ నుండి ఇప్పుడు అప్పుడు అని వినిపిస్తున్న కానీ, నిన్ననే షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు… ఇది అనిమల్, అర్జున్ రెడ్డి తీసిన సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ కాబట్టి, మన ప్రభాస్ ని సందీప్ ఎలా చూపిస్తాడో అని అందరికి ఒక excitment ఉంది…
ఐతే ఈ సినిమా ఒక్క ప్రభాస్ ఫాన్స్ కోసమే అనుకునేరు… ఇంకా రవి తేజ, త్రివిక్రమ్ ఫాన్స్ కూడా చూస్తారు మరి… ఎందుకు అంటే, లాంచ్ ఈవెంట్ తర్వాత విడుదల చేసిన క్రూ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరిలో స్పెషల్ అట్రాక్షన్ – డైరెక్షన్ డిపార్ట్మెంట్ దే!

ఎందుకంటే టాలీవుడ్ టాప్ లెజెండ్స్ వారసులు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి ఇంకా రవితేజ కుమారుడు మహద్థాన్, ఇద్దరూ ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేయబోతున్నారు.
మహద్థాన్ ;Raja The Great ‘ లో బాలనటుడిగా కనిపించిన విషయం తెలిసిందే.
ఇద్దరికీ దర్శకత్వంపై ప్రత్యేక ఆసక్తి ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ వాళ్ల కెరీర్ లో గోల్డెన్ ఆపర్చ్యూనిటీ గా మారింది. సందీప్ ఈ జనరేషన్ డైరెక్టర్ అంటారు అందరు… అందుకే సందీప్ దెగ్గర ట్రైన్ ఐతే ఈ కాలం కుర్ర filmmakers కి మంచిదే కదా…