ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా స్టైల్ ఇదే…

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కొత్తతరం దర్శకుడు. హనుమాన్ సినిమా తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఇటీవల ఆయన లైనప్‌పై కొంత కాంట్రవర్సీ వచ్చినా… సినిమాల్ని ఎలా చూసుకోవాలి, ఎలాంటి క్లారిటీ ఉండాలి అన్న విషయాల్లో మాత్రం ప్రశాంత్ వర్మ కి క్లారిటీ ఉంది.

లేటెస్ట్ గా గోవా లో జరిగిన IFFI ఈవెంట్‌లో ఆయన చేసిన ఒక కామెంట్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే విషయం అయ్యింది. ముఖ్యంగా పోస్ట్-ప్రొడక్షన్‌కు డైరెక్టర్స్ టైమ్ అడగటం… అది ఎందుకు ముఖ్యమో చాలా క్లియర్‌గా చెప్పాడు.

ఇప్పటి పరిస్థితుల్లో నిర్మాతలకే రిలీజ్ డేట్‌పై కంట్రోల్ లేనప్పుడు… ప్రశాంత్ వర్మ చెప్పిన ఈ మాటలు మరింత అర్ధవంతంగా నిలుస్తాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం —
“నేను సైన్ చేసే ప్రతి సినిమా ఒప్పందంలో ఒక క్లాజ్ పెట్టిస్తా. రిలీజ్ డేట్ ఫైనల్ నిర్ణయం నా చేతిలోనే ఉండాలి అని”.

అందుకు ఆయన చెప్పిన కారణం కూడా చాలా రియలిస్టిక్‌గానే ఉంటుంది.

ప్రశాంత్ వర్మ మాటల్లోనే —
“VFX ఆర్టిస్ట్‌కి టైమ్ ఎక్కువగా ఇవ్వాలి… లేదా మీ దగ్గర పెద్ద బడ్జెట్ ఉంటే, పెద్ద కంపెనీకి పంపించి చేయించాలి. నా మొదటి సినిమాల్లో కొన్ని చెడ్డ అనుభవాలు రావడంతో నేను నిర్మాతలకు ముందుగానే చెబుతాను — RELEASE DATE ని నేను నిర్ణయిస్తా. సినిమా షూట్ అయిపోయాక, దాన్ని సరిగ్గా ‘కుక్’ చేయడానికి నాకు టైమ్ కావాలి. ఆ టైమ్ నాకు ఇవ్వడానికి నా నిర్మాతలు కూడా ఓకే చెప్పారు.”

అసలు ఈ స్ట్రాటజీ ప్రతీ డైరెక్టర్ కూడా ఫాలో అవ్వాల్సిందే.
OTT ప్రెజర్, థియేట్రికల్ ప్రెజర్… ఏం ఒత్తిడి వచ్చినా, చివరికి సినిమా ఎలా అవుతుందో కీర్తి లేదా నింద మాత్రం డైరెక్టర్‌కే పడుతుంది.
అయితే, విజన్ ఎప్పుడు రీచ్ అవుతుందో కూడా డైరెక్టర్‌కే క్లియర్‌గా ఉంటుంది… కాబట్టి రిలీజ్ డేట్‌పై ఫైనల్ కంట్రోల్ కూడా ఆయనకే ఉండాలి.

ప్రశాంత్ వర్మ ఈ స్ట్రాటజీతో సక్సెస్ సాధించాడు.
కానీ ప్రతి డైరెక్టర్ ఇలా చేయడం సాధ్యం కాదు.
పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, ఇండస్ట్రీ ప్రెషర్స్… అందరిదీ ఒకేచోట కుదరదు. స్టార్ డైరెక్టర్స్ మాత్రమే ఇలాంటి పవర్‌ను ఎంజాయ్ చేయగలుగుతారు. మిగతా వాళ్లు మాత్రం సిస్టమ్ ఒత్తిడికి లోబడిపోతారు.

ఎప్పుడో ఒక రోజు ఈ పరిస్థితి కూడా మారుతుందని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *