రామ్ చరణ్ ‘పెద్ది’ షూట్‌ ఆలస్యం – కానీ రిలీజ్ డేట్ మార్చ్‌ 27, 2026 కే ఫిక్స్…

గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది షూట్‌లో బిజీగా ఉన్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా ప్రొడక్షన్‌ కొంచం ఆలస్యం అవుతోందట.

మొదటగా ఈ సినిమా డిసెంబర్ 2025 నాటికి పూర్తవుతుందనే ప్లాన్ చేశారు. కానీ షూట్ షెడ్యూల్‌లో ఏర్పడిన కొన్ని ఆటంకాల వల్ల అది జనవరి 2026 వరకు లేటవవచ్చని టాక్. దీంతో పోస్ట్ ప్రొడక్షన్‌కి టైమ్ చాలా తక్కువగా మిగిలిపోతుందని చెబుతున్నారు.

ఇక గేమ్ చేంజర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో పెద్ది పై అంచనాలు ఆకాశాన్నంటే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై మంచి కురియాసిటీ క్రియేట్ చేసింది. 1980ల నాటి పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కావడంతో సెట్‌ల నిర్మాణం, లొకేషన్ల రీక్రియేషన్‌, క్వాలిటీ విషయంలో టీమ్ చాలా జాగ్రత్తగా పనిచేస్తోంది.

అందుకే కొంత ఆలస్యం తప్పదనిపిస్తోంది. పెద్ద సినిమా కావడంతో పోస్ట్ ప్రొడక్షన్‌కి కూడా సమయం బాగా పడుతుంది. అయినప్పటికీ టీమ్ తమ రిలీజ్ డేట్‌ను మార్చకుండా మార్చ్ 27, 2026 న, అంటే రామ్ చరణ్ బర్త్‌డే రోజునే సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్‌లో ఉన్నారట.

డైరెక్టర్ బుచ్చి బాబుకి ఇది పెద్ద ఛాలెంజ్‌గా మారింది — డిలే లేకుండా, పొరపాట్లకు తావు లేకుండా అన్ని వర్క్స్ పూర్తి చేయడం. కానీ చరణ్ మాత్రం ప్రతి డిపార్ట్‌మెంట్‌లో తన ఇన్‌వాల్వ్‌మెంట్‌ చూపిస్తూ, సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన ఫామ్‌ను తిరిగి తెచ్చుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు.

జాన్వి కపూర్, ಶಿವరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పెడ్డి సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఏ.ఆర్. రెహ్మాన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *