Native Async

రవి బాబు ‘రేజర్’ టైటిల్ గ్లింప్సె…

Ravi Babu’s Razor: Director Turns Dark with Intense Crime Action Thriller | Summer 2026 Release
Spread the love

హాస్యం, విభిన్నమైన కథలతో తనదైన శైలిని ఏర్పరుచుకున్న దర్శకుడు రవి బాబు… ఇప్పుడు పూర్తిగా భిన్నమైన దారిలో అడుగుపెడుతున్నారు. ఆయన తాజా ప్రయోగం ‘రేజర్’ సినిమా. ఈ సినిమా ఫుల్ గా డార్క్ క్రైమ్ స్టోరీ అంట!

ఇటీవల వచ్చిన ఏనుగుతొండం ఘటికాచలం లాంటి వినోదాత్మక చిత్రానికి పూర్తి విరుద్ధంగా, రేజర్ ఒక ఇంటెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది ఏమిటంటే… ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రెజెంట్ చేయడం. ఇది రవి బాబు – సురేష్ బాబు కాంబినేషన్‌లో మరో మంచి సినిమా అని అంటున్నారు.

రవి బాబు కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా, ఈ సినిమా లో ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. ఆయన ఈసారి కనిపించబోయే పాత్ర… ఇప్పటివరకు చూసిన రవి బాబు పాత్రలన్నిటికీ భిన్నంగా, చాలా క్రూరంగా, భయంకరంగా ఉండబోతోందనే సంకేతాలు ఇప్పటికే బయటకు వచ్చాయి.

ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రా అండ్ అగ్రెసివ్ విజువల్స్‌తో, నేర ప్రపంచంలోకి మనల్ని లాగేసేలా ఉన్న ఆ క్లిప్… రవి బాబు పాత్ర ఎలాంటి క్షమలేని వ్యక్తిత్వంతో నేరస్తులను ఎదుర్కొంటుందో స్పష్టంగా చూపించింది.

షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న ఈ సినిమా, రవి బాబు కెరీర్‌లోనే అత్యంత బోల్డ్ ప్రయోగంగా నిలవబోతోందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. 2026 సమ్మర్‌లో థియేటర్లలో విడుదల కావాల్సిన ‘రేజర్’, తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక డార్క్, డిఫరెంట్ అనుభవాన్ని అందించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit