రవి తేజ ‘భర్త మహాసయులకు విజ్ఞప్తి’ టీజర్…

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రాబోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాసయులకు విజ్ఞప్తి’ ఇప్పటికే టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌తో పాటు విడుదలైన తొలి రెండు పాటలతో పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఈ టీజర్‌లో హీరో భార్య, లవర్ మధ్య ఇరుక్కుని, గిల్టీ ఫీలింగ్‌తో పాటు అయోమయంలో ఉన్నట్టు చూపించారు… చివరికి తన సమస్యలకు పరిష్కారం కోసం ఒక సైకియాట్రిస్ట్‌ను ఆశ్రయించడం కథలో కీలకంగా నిలుస్తుంది. భార్య, గర్ల్‌ఫ్రెండ్ మధ్య అతను ఎలా చిక్కుల్లో పడతాడో, ఆ పరిస్థితుల్ని హాస్యాత్మకంగా చూపించడం టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇటీవల కాలంలో ఎక్కువగా మాస్, యాక్షన్ పాత్రల్లో కనిపించిన రవితేజ… ఈసారి పూర్తిగా ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌లో, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథలో కనిపించడం నిజంగా రిఫ్రెషింగ్‌గా ఉంది. అతని ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రతి సారి నవ్వులు పూయిస్తాయి. రవితేజ కామిక్ టైమింగ్ మరోసారి తన స్ట్రెంగ్త్ ఏంటో గుర్తు చేస్తుంది.

హీరో భార్యగా డింపుల్ హయతి తన పాత్రను చాలా మంచిగా పోషించింది. గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో ఆశికా రంగనాథ్ చార్మ్‌తో ఆకట్టుకుంటుంది. ఇక చాలా కాలం తర్వాత సునీల్ పూర్తి స్థాయి కామెడీ రోల్‌లో తిరిగి రావడం సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా మారింది.

మొత్తానికి, ఈ టీజర్ చూస్తే ‘భర్త మహాసయులకు విజ్ఞప్తి’ ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫెస్టివ్ ఎంటర్‌టైనర్‌గా నిలవబోతుందనే ఫీలింగ్ బలంగా కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *