రవి తేజ మాస్ జాతర రిలీజ్ కి అంతా సిద్ధం…

మాస్ మహారాజ గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? అసలు పెద్ద స్క్రీన్ మీద ఆ ఎనర్జీ కి ఎవ్వరు సాటి రారు… ఇక మరి అయన నెక్స్ట్ సినిమా ఏంటి ఆంటే, మాస్ జాతర అని తెలిసిందే గా…

ఎన్నో వాయిదాల తర్వాత చివరికి మాస్ జాతర రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అదే రోజు బాహుబలి రీ-రిలీజ్ షోలను మినహాయిస్తే పెద్దగా పోటీ లేకపోవడంతో టీం కాన్ఫిడెంట్‌గా ఈ డేట్ లాక్ చేసింది.

అయితే మాస్ జాతర కి అతిపెద్ద చాలెంజ్ బజ్ క్రియేట్ చేయడమే. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి.

ఈ సినిమా తో భాను భోగవరపు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. టాలీవుడ్ లో స్టార్ రైటర్‌గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నా, డైరెక్టర్ కుర్చీ మాత్రం వేరు. కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నా, సినిమా మీద మార్కెట్‌లో పెద్దగా హడావిడి కనిపించడం లేదు. ట్రైలర్స్ లో మాత్రం రవితేజ ఎక్స్‌పెక్టెడ్ ఎనర్జీ కనిపించింది. కానీ స్టోరీ రూటీన్ అయిపోతుందేమోనన్న చిన్న టెన్షన్ ఫ్యాన్స్ కి ఉంది. అయితే తాజాగా వచ్చిన OG లా కరెక్ట్ ఎలివేషన్, గ్రిప్పింగ్ టెంపో ఉంటే ఫ్యామిలియర్ స్టోరీ కూడా హిట్ అవుతుందని నమ్మకం ఉంది.

ఇక రవితేజ కి ఈ సినిమా చాలా క్రుషియల్. ధమాకా, వాల్టేర్ వీరయ్య తప్పా గత రెండేళ్లలో మిగతా సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఎక్స్‌పెరిమెంట్స్ ఫెయిల్ అయ్యాయి, ఫార్ములా సినిమాలు కూడా పనిచేయలేదు. ఇక ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా వరుసగా కింగ్‌డమ్, వార్ 2 ఫ్లాప్స్ తర్వాత ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా, మ్యూజిక్ భీమ్స్ సెసిరోలియో అందిస్తున్నాడు. ఆల్రెడీ మాస్ బీట్‌లు ఎక్స్‌పెక్ట్ అవుతున్నాయి. మొత్తానికి ఈసారి మాస్ మహారాజా హంగామా మీదే అన్న నమ్మకంతో టీం ముందుకు వెళ్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *