టాలీవుడ్ యువ నటుడు రోషన్ మేక ఛాంపియన్ సినిమా పైన చాల అంచనాలు ఉన్నాయ్… పీరియాడిక్ సబ్జెక్టు కావడం, అది కూడా పల్లెటూరి కథ కావడం తో మంచి బజ్ ఉంది. సినిమా రిలీజ్ డేట్ కి ఇంకో నెల రోజులే ఉండడం తో ప్రొమోషన్స్ తో ఇంకా బజ్ పెంచుతున్నారు నిర్మాతలు…
లేటెస్ట్ గా సినిమా నుంచి, “గిరా గిరా గింగిరాగిరేయ్…” సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి సూపర్ అనిపించారు… ఇందులో రోషన్ 60s కాలం లో లా కనిపించి భలే అనిపించాడు… ఇక హీరోయిన్ తాను ఒక నాటకం వేయగలమని, challenge చేసి మరి చూపిస్తుంది… అలా పాత ప్రోమో బజ్ ని పెంచింది. ఫుల్ సాంగ్ 25th న రిలీజ్ చేస్తారంట… రామ్ మిరియాల పాడిన ఈ సాంగ్ కోసం అందరు వెయిటింగ్… మంచి మెలోడియస్ సాంగ్ కదా మరి!
ఈ సినిమా లో రోషన్ హీరో కాగా Anaswara రాజన్ హీరోయిన్… తను కూడా పల్లెటూరి అమ్మాయి లా భలే ఉంది!
ప్రదీప్ అడ్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ని వైజయంతి బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25th న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.