తమిళనాడులో ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో సంస్థ ముఖ్య నాయకుడు మోహన్ భగవత్ నాలుగు రోజులపాటు తమిళనాడులో పర్యటించనున్నారు. ఆయన తిరుచిరాపల్లిలో ప్రత్యేక స్వాగతం మధ్య చేరుకున్నారు.
ఈ పర్యటనలో భాగంగా భగవత్ వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సాంస్కృతిక, సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆర్ఎస్ఎస్ గత 100 ఏళ్లలో దేశ సేవ, సామాజిక సమగ్రత, సంస్కృతి పరిరక్షణకు చేసిన కృషిని ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం. వివిధ శ్రేణుల ప్రజలు, స్వయంసేవకులు ఆయన ప్రసంగాలు వినడానికి, సమావేశాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
తిరుచిలో ప్రారంభమైన ఈ పర్యటనలో భగవత్ స్థానిక నాయకులు, మేధావులు, యువతతో సమావేశాలు జరిపి సమాజ సమస్యలు, జాతీయ ఏకత, సేవా కార్యక్రమాల విస్తరణపై చర్చించనున్నారు. ప్రాంతీయంగా ఆర్ఎస్ఎస్ చేపట్టిన పర్యావరణ సంరక్షణ, గ్రామాభివృద్ధి, విద్యా సేవా కార్యక్రమాలను కూడా ఆయన సమీక్షించనున్నారని కార్యదర్శులు తెలిపారు.
భగవత్ పర్యటనతో రాష్ట్రంలో ఆర్‌ఎ్‌ఎస్ శతాబ్ధి ఉత్సవాలకు మరింత ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటన తమిళనాడులో సంస్థ కార్యకలాపాలకు కొత్త దిశానిర్ధేశం ఇచ్చే అవకాశం ఉందని సంఘ పదాధికారులు ఆశిస్తున్నారు.