సమంత రీ-ఎంట్రీకి సిద్ధం… ‘మా ఇంటి బంగారం’, ‘అరసన్’తో డబుల్ దుమ్ము!

తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన సమంత, గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వలన సినిమాల నుంచి కొంత విరామం తీసుకుంది. ఆ మధ్య ఆమె సొంత నిర్మాణంలో వచ్చిన శుభం చిత్రంలో చిన్న పాత్రలో మాత్రమే కనిపించారు. చాల టైం కింద ప్రకటించిన మా ఇంటి బంగారం సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకపోవడంతో అభిమానులు కొంచెం నిరాశలో ఉన్నారు.

కానీ ఇప్పుడు సమంత మళ్లీ పూర్తి ఉత్సాహంతో రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. తాజాగా ఆమె మా ఇంటి బంగారం షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని ధృవీకరించారు.

అదే సమయంలో, తమిళ సినీ పరిశ్రమలో కూడా ఆమెకు భారీ ఆఫర్ దక్కింది. కొలీవుడ్ టాప్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో సింబు హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ అరసన్ లో సమంత హీరోయిన్‌గా నటించనున్నారు.

వెట్రిమారన్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఎప్పుడూ బలమైన ప్రాధాన్యత ఉంటుంది. సమంత లాంటి ప్రతిభావంతురాలు ఆ పాత్రలో మెరిసితే, ఆమె కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందనడంలో సందేహం లేదు.

ఒక వైపు మా ఇంటి బంగారం, మరో వైపు అరసన్… ఈ రెండు సినిమాలతో సమంత అభిమానులందరూ ఇప్పుడు ఒక్క మాటే అంటున్నారు — “సమంత ఈజ్ బ్యాక్!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *