మళ్ళి సంక్రాంతి బరిలో శర్వానంద్…

తెలుగు సినిమా రంగంలో పెద్ద హీరోలకి అది కూడా సంక్రాంతి టైం లో పోటీ పడే సత్తా ఉన్న ఏకైక హీరో శర్వానంద్… కానీ ఇటీవల వరుస ప్లాప్‌లతో కెరీర్‌లో కొంచం డీలా పడ్డాడు. కాబట్టి ఇప్పుడు అతనికి ఒక భారీ హిట్ కావలి. అందుకే మళ్ళి తనకి కలసి వచ్చిన పొంగల్ సీజన్లో సినిమాని దించాలని అనుకుంటున్నాడు.

ఫస్ట్, తన బైకర్ సినిమా ని డిసెంబర్ 6న రిలీజ్ చేయాలి అనుకున్నారు — అంటే బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ అయినా నెక్స్ట్ డే అనమాట. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మూవీని వాయిదా వేసేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే… మరోవైపు ‘నారి నారి నడుమ మురారి’ సినిమాని Sankranti సీజన్లో లో విడుదల చేయాల్సిందేనని నిర్మాత అనిల్ సుంకర ఫిక్స్ అయ్యారు.

కానీ ఈసారి సంక్రాంతి రేసు ఏ తార లెవెల్‌లో ఉందో చూడండి:

  • ప్రభాస్ ‘ది రాజా సాబ్’ – 9th జనవరి
  • చిరంజీవి ‘మన శంకర వార ప్రసాద్ గారు’
  • రవి తేజ ‘భారత మహాసాయులకు విజ్ఞప్తి’
  • నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’
  • విజయ్ ‘జన నాయకన్’
  • శివ కార్తికేయన్ ‘పరాశక్తి’…

ఇన్ని సినిమాలు ఉన్న సమయంలో స్క్రీన్ దొరకాలంటే కష్టం! శర్వానంద్ సినిమాకు ఇది ఓ పెద్ద పరీక్ష. అయినా కూడా… నిర్మాత అనిల్ సుంకర వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. సంక్రాంతి ఎలాగైనా మా మూవీదే అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు.

దీని వెనుక ఉన్న పెద్ద కారణం — శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్:
శతమానం భావతి, ఎక్స్‌ప్రెస్ రాజా రెండు సినిమాలు సంక్రాంతి రెస్లో సీనియర్ హీరోల మధ్యనైనా భారీ హిట్స్ కొట్టిన సినిమాలే. అందుకే టీం ఈ సెంటిమెంట్నే నమ్ముకుని ముందుకు వెళ్తోంది.

‘నారి నారి నడుమ మురారి’ ఒక మంచి ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకూ అందరినీ ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయని యూనిట్ నమ్ముతోంది.

హ్యాపెనింగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమ్యుక్తా మేనన్, సాక్షి వైద్య హీరోయిన్స్… సో, చూద్దాం సినిమా హిట్ అవుద్దో లేదో అని!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *