సలార్ షూట్‌కి ముందు ప్రతి సారి 60 పుషప్‌లు చేసేదాన్ని – శ్రీయా రెడ్డి

శ్రియ రెడ్డి… అబ్బా పవన్ కళ్యాణ్ OG లో తన నటన సూపర్ కదా… అలానే ప్రభాస్ సలార్ లో కూడా అద్భుతంగా నటించింది. అందుకే ప్రస్తుతం సౌత్ ఇండియా లో తాను మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్… శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సహనటులను సులభంగా డామినేట్ చేస్తూ, ప్రతి సీన్‌లో ఫోకస్‌ను తనవైపే మళ్లిస్తుంది కాబట్టి, ఇప్పుడు మేకర్స్ తాను తమ సినిమాలో ఉండాలి అనుకుంటున్నారు…

ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ను బయటపెట్టింది. “సలార్ సినిమా సమయంలో, ప్రతి షాట్‌కి వెళ్లే ముందు నేను నా కారవాన్‌లో 50 నుంచి 60 పుషప్‌లు చేసేదాన్ని. అది నాకు ఒక చిన్న రొటీన్‌లా మారింది. అలా చేయడం వల్ల నేను మరింత పవర్‌ఫుల్‌గా, ఇన్‌విన్సిబుల్‌గా ఫీల్ అయ్యేదాన్ని,” అని ఆమె చెప్పింది.

“ఖన్సార్‌లో, అంతమంది పురుషుల మధ్య నిలబడి ఉండాలి అంటే, నాకు ఆ ఇన్‌విన్సిబుల్ ఫీలింగ్ లోపల నుంచే రావాలి. అందుకే ప్రతి సారి నాకు కొంచెం టైమ్ ఇచ్చి, పుషప్‌లు వేసి, తర్వాత షూట్‌కి వెళ్లేదాన్ని,” అంటూ ఆమె చెప్పిన మాటలు చాలా మందికి ప్రేరణగా మారాయి.

అలాగే, పవన్ కళ్యాణ్ కూడా ఓజీ ప్రమోషన్స్ సమయంలో శ్రీయా ఫిట్‌నెస్‌కి, ఆమె డెడికేషన్‌కి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం శ్రీయా రెడ్డి సలార్ పార్ట్ 2 చిత్రంలో కనిపించబోతోంది.

మొత్తానికి, శ్రీయా రెడ్డి చెప్పిన ఈ చిన్న వర్కౌట్ హాబిట్ ఇప్పుడు ఫిట్‌నెస్‌ప్రియులందరికీ ఇన్‌స్పిరేషన్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *