ఈ రోజు స్మార్త,మాధ్వ నిర్జల ఏకాదశి. భీమ ఏకాదశీ అని కూడా పిలుస్తారు. బ్రహ్మ వైవర్త పురాణము ప్రకారం, పాండవులలో రెండవవాడు అయిన భీముడు మంచి తిండి పుష్టి కలవాడు,ఆకలికి తాళలేని వాడు. ప్రతి 15 రోజులకు వచ్చే ఏకాదశీ అందరూ ఉపవాసం ఉంటుంటే, ఆకలికి తాళలేక తాను మాత్రం ఉండేవాడు కాదుట. గమనించిన వేద వ్యాసుడు, సంవత్సరంలో వచ్చే , 24 ఏకాదశీ ఉపవాసాలు ఆచరించక పోయినా ఈ జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉండమని, ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే… సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి రోజుల్లో ఉపవాసాలు ఉన్న ఫలితం ఉంటుందని భీమసేనుడుకి నచ్చచెప్పి, ఉపవాసం ఉండేలా చేసాడుట. అందుకని ఈ ఏకాదశిని భీమసేనీ ఏకాదశీ అని కూడా పిలుస్తారు. కాబట్టి సంవత్సరంలో వచ్చే అన్నీ ఏకాదశీ ఉపవాసాలు ఉండలేని భక్తులు కనీసం ఈ నిర్జల ఏకాదశీ ఉపవాసం ఉండి వ్రతం ఆచరించడం వలన, సంవత్సరంలో అన్నీ ఏకాదశీ వ్రతాలను ఆచరించిన ఫలితం దక్కుతుంది అని నమ్మకం. ద్వాదశి హరి వాసరం రేపు ప.11.25 వరకూ ఉన్నందువలన ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు మ.01.34 నుండి సా.04.12 వరకూ ఉంటుంది.
Related Posts
హనుమాన్ చాలీసా పారాయణంలో చేయకూడని తప్పులు
హనుమాన్ చాలీసా పారాయణం అనేది భక్తిలో అత్యంత శక్తివంతమైన సాధనలలో ఒకటి. హనుమంతుడు భూతప్రేత పిశాచాదులను దూరం చేసి భక్తులకు రక్షణనిచ్చే దైవంగా ప్రసిద్ధి. అందుకే చాలామంది…
హనుమాన్ చాలీసా పారాయణం అనేది భక్తిలో అత్యంత శక్తివంతమైన సాధనలలో ఒకటి. హనుమంతుడు భూతప్రేత పిశాచాదులను దూరం చేసి భక్తులకు రక్షణనిచ్చే దైవంగా ప్రసిద్ధి. అందుకే చాలామంది…
బండ్ల గణేష్ ఇంట్లో మెగా దీపావళి సెలెబ్రేషన్స్
Post Views: 36
Post Views: 36
కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి…దర్శించుకున్నవారి జన్మధన్యం సుమీ
శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభోగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగోరోజైన శనివారం రోజు తిరుమల క్షేత్రం భక్తులతో కళకళలాడింది. ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ ఆలంకారంలో, కల్పవృక్ష వాహనంపై…
శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభోగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగోరోజైన శనివారం రోజు తిరుమల క్షేత్రం భక్తులతో కళకళలాడింది. ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ ఆలంకారంలో, కల్పవృక్ష వాహనంపై…