ఎప్పుడు తనదైన కథలు, వినూత్న హాస్యంతో ప్రేక్షకులను అలరించే శ్రీ విష్ణు మరో ప్రత్యేకమైన ఎంటర్‌టైనర్‌తో తిరిగి వస్తున్నాడు. డెబ్యూ దర్శకుడు యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో ‘విష్ణు విన్యాసం’ సినిమా తో రాబోతున్నాడు. టైటిల్ వినగానే ఆసక్తిని రేపే ఈ చిత్రం, ఓ కొత్త తరహా కామెడీ అనుభూతిని అందించబోతుందని టీమ్ చెబుతోంది.
ఈ సినిమా టైటిల్‌ను ఈ రోజు అధికారికంగా విడుదల చేశారు. అందుకోసం రిలీజ్ చేసిన ఆకట్టుకునే యానిమేటెడ్ గ్లింప్స్ సినిమాకి ఉన్న క్విర్కీ టోన్‌ను చక్కగా పరిచయం చేసింది. నగర వీధుల్లో మూడు అంతస్తులుగా డిజైన్ చేసిన బైక్‌పై శ్రీ విష్ణు ప్రయాణించటం వెంటనే బాగుంది…
“విచిత్ర విన్యాసం” అనే డైలాగ్‌తో వచ్చే వాయిస్ ఓవర్ ఈ చిత్రం ఓ పిచ్చి సరదా కథతో రాబోతోందని స్పష్టం చేస్తోంది. ఈ గ్లింప్స్ చూస్తే, కథ జ్యోతిష్యం నేపథ్యంగా సాగనుందన్న విషయం అర్థమవుతోంది.
“No Brakes, Just Laughs” అనే టైటిల్ ట్యాగ్‌లైన్ సినిమా మొత్తం ఒక ఫుల్ ఫన్ రైడ్‌లా ఉండబోతుందని హామీ ఇస్తోంది. ప్రోమో చూసిన తర్వాత సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.
ఈ చిత్రంలో నయన హీరోయిన్‌గా శ్రీ విష్ణుకు జోడీగా నటిస్తున్నారు. సోర్సెస్ ప్రకారం, మేకర్స్ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది, ఇంకా రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.