సచిన్ టెండుల్కర్ తో మన OG డైరెక్టర్…

సుజీత్… ఈ పేరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా బాగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తో OG బ్లాక్బస్టర్ అయ్యింది కనుక అందరు సుజీత్ తో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు సచిన్ టెండుల్కర్ తో సహా…

ఇంతకీ మధ్యలో సచిన్ ఎందుకు వచ్చాడు అంటారు??? అయ్యో సినిమా కి కాదండి బాబు, TV యాడ్ కి!

‘దే కాల్ హిమ్ OG’ సినిమాతో సక్సెస్ రుచి చూసిన యువ దర్శకుడు సుజీత్, ఇప్పుడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో కలిసి ఒక కొత్త టెలివిజన్ కమర్షియల్ కోసం జట్టు కట్టారు. ఈ యాడ్‌ షూట్ ఇటీవల విదేశాల్లో జరిగింది.

షూటింగ్ లొకేషన్‌ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో సుజీత్ సచిన్‌కి డైరెక్షన్స్ ఇస్తుండగా, సచిన్ చిరునవ్వుతో చాలా రిలాక్స్‌గా కనిపిస్తున్నారు. ఈ యాడ్‌ ఒక పెయింట్ కంపెనీ కోసం తెరకెక్కించబడింది. సచిన్‌ దానికి బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరించగా, ఈ ఇద్దరి కలయిక అభిమానుల్లో పెద్ద ఆసక్తిని రేకెత్తించింది.

ఇప్పుడు సుజీత్ నాని తో చేసే కొత్త ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత They Call Him OG సీక్వెల్ పై కూడా పని మొదలు పెట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *