నిఖిల్ స్వయంభు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసారు…

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టాడో మనకు తెలిసిందే కదా… ఇక నెక్స్ట్ కొన్ని చిన్న సినిమాలు వచ్చినా కానీ, అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. ఇక స్వయంభు సినిమా రెండు ఏళ్ళ కింద అనౌన్స్ చేసాడు కానీ updates అంతగా రాలేదు… సో ఫాన్స్ కంగారు పడ్డారు… కానీ ఇప్పుడు అన్ని డౌట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే… ఎందుకంటే స్వయంభు షూటింగ్ అయిపోయింది… రిలీజ్ కి రెడీ గా కూడా ఉంది! ఈ న్యూస్ నిఖిల్ స్వయంగా తన టీం మెంబెర్స్ ని పరిచయం చేస్తూ చెప్పాడు అది కూడా స్వయంభు సెట్ లో…

ఈ సినిమా భారత ఇతిహాసాల నడుమ జరిగే యుద్ధగాథ… భావోద్వేగాలు, దేశభక్తి, సంస్కృతి, మనసును కదిలించే ఘనత… ఈ అన్నింటినీ ఒకే కాన్వాస్ పై నిర్మిస్తూ, ప్రపంచవ్యాప్తంగా మహాశివరాత్రి – ఫిబ్రవరి 13, 2026 న విడుదలకు సిద్ధమైంది.

తన పాత్ర కోసం నిఖిల్ చేసిన ట్రాన్స్‎ఫర్మేషన్, బాడీ బిల్డింగ్, గుఱ్ఱపు స్వారీ, యాక్షన్ కామ్బాట్ ట్రైనింగ్ – అన్నీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేంత గా.

తన గుఱ్ఱానికి ‘మారుతి’ అని పేరు పెట్టుకొని, క్రూ సభ్యుల కష్టాన్ని గౌరవంగా గుర్తించిన నిఖిల్, హిందీ వెర్షన్ కి కూడా వాయిస్ ఇచ్చి మరో స్టెప్ ముందుకేసారు.

ఈ సినిమా క్రూ ని కూడా పరిచయం చేసాడు…

సినిమాటోగ్రఫీ: KK సెంటిల్ కుమార్

మ్యూజిక్: రవి బస్రూర్

ప్రొడక్షన్ డిజైన్: ఎం. ప్రభాహరన్ & రవీందర్

హీరోయిన్స్: సమ్యుక్త, నభా నటేష్

ప్రొడ్యూసర్స్: భువన్ & శ్రీకర్ – పిక్సెల్ స్టూడియోస్

దర్శకుడు: భారత్ కృష్ణమాచారి

ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ జెట్ స్పీడ్ లో సాగుతుండగా, ట్రేడ్ వర్గాలు ఇంకా సినీ ప్రేక్షకులంతా 2026లో అత్యంత ఎక్స్‌పెక్టడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ఇదేనంటూ మాటలాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *