తేజ సజ్జ మిరాయి OTT కి వచ్చేస్తొందోచ్…

మిరాయి… పవన్ కళ్యాణ్ OG సినిమా రిలీజ్ అయ్యే వరకు, ఈ సినిమా గురించే చర్చ! అసలు తేజ ఏంటి బ్యాక్ తో బ్యాక్ blockbusters ఇస్తున్నాడు… సూపర్ కదా అనుకున్నాం! అలానే అతను చేసే సినిమాలు కూడా నార్మల్ యాక్షన్ అడ్వెంచర్స్ కాకుండా మంచి మన పురాణలోంచి కథలు వెతికి వాటికీ ఒక సూపర్ హీరో కథ జోడించి మంచి హిట్స్ సాధిస్తున్నాడు.

ఇక మిరాయి కథ విషయానికి వస్తే, అశోకుడు దాచిన అమరత్వ రహస్యం, ఆ తొమ్మిది గ్రంధాలూ కాపాడే యోధుడి గా తేజ కనిపిస్తే, ఆ గ్రంధాలని దొంగలించి, లోకాన్ని ఏలాలని అనుకునే పాత్ర లో మంచు మనోజ్ నటించాడు…

ఇలా ఈ సినిమా అప్పుడే 150 కోట్ల కలెక్షన్ దాటేసింది… ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఐతే ఈ సినిమా కోసం OTT లవర్స్ చాల కాలంగా ఎదురు చూస్తున్నారు.

అందుకే నిర్మాతలు కూడా ఈ సినిమా ని కేవలం 28 రోజుల థియేటర్ రన్ తో 10th అక్టోబర్ న JIO HOTSTAR లో స్ట్రీమ్ చేయడానికి రెడీ గా ఉన్నారు… ఆల్రెడీ సోషల్ మీడియా లో OTT పోస్టర్ కూడా రిలీజ్ చేసేసారు…

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 28 రోజుల థియేట్రికల్ విండో పూర్తవగానే హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. అయితే, హిందీ వెర్షన్‌కి మాత్రం ఇంకా స్పష్టమైన ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. ఉత్తర భారత multiplex ఒప్పందాల ప్రకారం హిందీ సినిమాలకు సాధారణంగా 56 రోజుల (8 వారాల) థియేట్రికల్ విండో ఉంటుంది.

అందుకే రెడీ గా ఉండండి… మిరాయి ని మరోసారి OTT లో ఫామిలీ సభ్యులందరితో చూడడానికి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *