ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ నెలలో 3.046 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా సెప్టెంబర్ 29న రూ. 278 కోట్లు, సెప్టెంబర్ 30న రూ. 333 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టుగా అబ్కారీ శాఖ తెలియజేసింది. సాధారణంగానే వీకెండ్స్ లేదా పండుగ పర్వదినాల్లో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరగుతుంటాయి. ఇక గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1న మూడు రోజుల వ్యవధిలో 60 నుంచి 80 శాతం మేర అమ్మకాలు జరిగినట్టుగా అబ్కారీ శాఖ తెలియజేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 7 శాతం అధికమని తెలియజేసింది.
ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సింహభాగం ఈ మద్యం విక్రయం ద్వారానే వస్తుంది. అందుకే ప్రభుత్వాలు మద్యపాన నిషేధంపై పలు ఆలోచనలు చేస్తుంటాయి. ప్రభుత్వానికి ఆదాయం అందించే మద్యం విక్రయాలను నిలిపివేసేందుకు ముందుకు రాదనడంలో సందేహం లేదు. ఒకవేళ ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధంపై హామీలు ఇచ్చినా వాటిని నిలుపుకోవడంలో విఫలమౌతూ వస్తుంటాయి. అందుకే మద్యపాన నిషేధంపై పార్టీలు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి హామీలు ఇస్తుంటాయి. ఇక సెప్టెంబర్‌లో 3 వేల కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగ్గా, అక్టోబర్ నెలలో ఏ మేరకు విక్రయాలు జరుగుతాయో చూడాలి.