ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అమెరికా బయట తయారైన సినిమాలపై 100% టారిఫ్ విధించే నిర్ణయం ఇప్పుడు కఠినమైన లీగల్ సవాళ్లతో ఎదురైంది. అసలు, Berman Amendment (50 U.S.C. §1702(b)(3)) స్పష్టంగా ప్రిన్సిపల్‌గా అధ్యక్షుడు IEEPA కింద సమాచారం, సమాచార సామగ్రి (films) పై టారిఫ్ విధించకుండా ఆపింది. ఈ అంశాన్ని కాంగ్రెసు రికార్డులు కూడా ధృవీకరించాయి.
ఇకపైగా, First Amendment హక్కులు, WTO (World Trade Organization) నియమాలు ఇలా కొన్ని అంతర్జాతీయ చట్టాల పరంగా కూడా సమస్యలు ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన కోర్ట్ తీర్పులు కూడా IEEPA కింద వచ్చిన ఇతర టారిఫ్ నిర్ణయాలను రద్దు చేశాయి. అందువల్ల ట్రంప్ సెప్టెంబర్ 29లో చేసిన టారిఫ్ ప్రకటన ప్రాక్టికల్‌గా అమలు చెయ్యడం అసాధ్యం.
ఈ నేపధ్యంలో, అమెరికా లో సినిమాలు దిగుమతి చేసుకుంటూ ఉండే హాలీవుడ్, ఇతర అంతర్జాతీయ ఫిల్మ్ ఇండస్ట్రీపై ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపకుండా పోతుంది. Tollywood మరియు ఇతర ఇండియాలోని సినిమా ఇండస్ట్రీకి ఇది పెద్ద రక్షణగా మారినట్లు కూడా చెప్పవచ్చు.
మొత్తం చెప్పాలంటే, ట్రంప్ ఫిల్మ్ టారిఫ్స్ అనేది కాన్స్టిట్యూషనల్ మరియు అంతర్జాతీయ చట్టాలతో లీగల్‌గా అమలు చేయలేని నిర్ణయం గా మారింది అని నిఖిల్ సిద్ధార్థ్ పోస్ట్ కి అర్ధం…