టాలీవుడ్ లో మన విజయ్ దేవరకొండ కి ‘రౌడీ’ అనే టాగ్ కూడా ఉంది కదా… ఐతే ఇప్పుడు అదే టాగ్ తో సినిమా కుశ చేస్తున్నాడు… అదే రౌడీ జనార్దన్. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్సె ఇందాకే రిలీజ్ చేసి, ఔరా అనిపించారు. సినిమా రిలీజ్ కి ఇంకా వన్ ఇయర్ టైం ఉన్న, ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు!
‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవికిరణ్ కోల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హింసాత్మక డ్రామాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 2026లో థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను ఈరోజు హైదరాబాద్‌లో అభిమానుల ఘన కేరింతల మధ్య విడుదల చేశారు. ఈ వీడియోలో ఎక్కువగా హీరో ఇంట్రో పైనే దృష్టి పెట్టారు. షూటింగ్‌లో ఇంకా కీలక భాగాలు మిగిలి ఉండటంతో, విజువల్స్‌ను ఎక్కువగా బయటపెట్టకుండా మిస్టరీని అలాగే ఉంచారు!
గ్లింప్సె లో కథ కాలింగపట్నం అనే గ్రామంలో జరుగుతుంది. ఈ ఊరు హింస, భయంతో నిండిన ప్రపంచంలా కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలను ‘రౌడీ లు’ అని పిలుస్తారు. అయితే వారు సహజంగా నేరస్తులు కాదు. వారి ఇంటిపేరే ‘రౌడీ’. ఈ వాతావరణంలోనే విజయ్ దేవరకొండ జనార్ధన అనే యువకుడు గా పరిచయం చేసారు. రక్తపాతం, హింసకు ఒక బ్రాండ్ అంబాసడార్ గా అతడు మారతాడు.
తన కి అడ్డొచ్చిన వారిని ఏమాత్రం వెనుకాడకుండా చంపేస్తాడు. ఈ భయంకర స్వభావానికి వెనుక అతని బాల్యంలో ఎదురైన చీకటి అనుభవాలే కారణం. చిన్నప్పటి నుంచి ఉన్న కోపం క్రమంగా అతడిని ఒక రాక్షసుడిగా మారుస్తుంది. అసలు ఈ రౌడీ జనార్ధన ఎవరు? అతడిని ఈ స్థాయి విధ్వంసానికి నడిపించిన కారణాలు ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం సినిమా విడుదలైన తర్వాతే దొరకనుంది.
టీజర్ విజువల్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి. క్రిస్టో జేవియర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని చీకటి వాతావరణానికి అద్భుతంగా సరిపోతోంది. కథానాయికగా నటిస్తున్న కీర్తి సురేష్ కూడా గ్లింప్స్‌లో కనిపించలేదు. ‘కింగ్డమ్’ సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోయినా, విజయ్ దేవరకొండ మళ్లీ అదే తరహా జానర్ సినిమా చేస్తూ గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.