రజినీకాంత్ జైలర్ 2 లో మొత్తం దడపుట్టించే కాస్ట్…

2023లో బ్లాక్‌బస్టర్‌గా మారిన రజినీకాంత్ జైలర్, ఇప్పుడు సీక్వెల్‌తో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 2026లో విడుదల కానున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడే కోలీవుడ్‌లో అతిపెద్ద అటెన్షన్ పొందుతున్న సినిమాగా నిలిచింది. కారణం ఒక్కటే — సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్‌గా స్క్రీన్‌పై పంజా విసరబోతున్నాడు.

షూటింగ్ వేగంగా జరుగుతుండగా… ప్రతి రోజు ఒక పెద్ద స్టార్‌ పేరుతో జైలర్ 2 తో చేరడం తో మరింత బజ్ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం… బహుముఖ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారంట. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న షెడ్యూల్‌లో ఆయన షూటింగ్ ప్రారంబించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. పెట్టా తర్వాత రజనీ–సేతుపతి కాంబినేషన్ మళ్లీ కలవడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది.

ఇప్పటికే ఈ సినిమాలో రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా వంటి నటులు ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ నటీమణి విద్యా బాలన్ ఈ జట్టులో చేరారు. ఆమె మిథున్ చక్రవర్తి పెద్ద కుమార్తె పాత్రలో కనిపించనున్నారు. ఇలా భిన్న భాషల నుంచి పలువురు స్టార్‌లు cameo క్యారెక్టర్లలో కనిపించబోతున్నారు.

జైలర్ యూనివర్స్‌ను మరింత విస్తరించేందుకు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇప్పటికే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మళయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ లాంటి పేర్లను చేర్చాడు. ఎస్.జే. సూర్యా కూడా ఒక చిన్న రోల్ చేస్తున్నాడు. టాలీవుడ్‌ నుండి నందమూరి బాలకృష్ణ ని కూడా స్పెషల్ రోల్‌ కోసం సంప్రదించగా, ఆయన అందుకు నో చెప్పారట. దీంతో పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ ఆ పాత్రను రీప్లేస్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ జాబితాలో ఇప్పుడు విజయ్ సేతుపతి చేరడంతో జైలర్ 2 మరింత భారీగా, మరింత గ్లామరస్‌గా మారిపోయింది. ఇన్ని పెద్ద పెద్ద పేర్లను ఒకే కథలో ఎలా నడిపిస్తాడు నెల్సన్? ఎవరికి ఎంత స్క్రీన్‌టైమ్ ఇస్తాడు? ఏ క్యారెక్టర్ ఎలాంటి స్పందన తెస్తుంది? — అన్నీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *