మహిళలకు పెద్దపీట వేస్తున్న దేశాలు..భారత్‌ స్థానం ఇదే

Women Peace and Security Index–2025 ప్రకారం మహిళలకు అత్యంత అనుకూలమైన దేశాల్లో ఉత్తర యూరప్ దేశాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. 0.939 స్కోర్‌తో డెన్మార్క్ మొదటి స్థానం దక్కించుకోవడం అక్కడి మహిళల భద్రత, సమానత్వం, ఉద్యోగ అవకాశాల్లో ఉన్న అభివృద్ధిని సూచిస్తుంది. ఐస్‌లాండ్‌ రెండో స్థానంలో నిలిచి ఆర్థిక స్వతంత్రత, సమాన హక్కుల చట్టాలతో మహిళలకు బలమైన రక్షణనిస్తుంది. నార్వే, స్వీడన్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి మహిళల ప్రాతినిధ్యం, సమాన వేతనాలు, గృహహింసపై కఠిన చర్యల్లో ముందున్నాయి. ఫిన్లాండ్‌ ఐదో స్థానంలో ఉండి విద్య, ఆరోగ్యం, భద్రతలో మహిళలకు అధిక అవకాశాలు కల్పిస్తోంది. లగ్జంబర్గ్‌, న్యూజీలాండ్‌ వంటి దేశాలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. అయితే మహిళలను గౌరవించే భారతదేశం 131వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *