అద్భుతం అనిపించినా జూటోపియా 2 సినిమా…

భారతీయ ప్రేక్షకుల కు ఎప్పటినుంచో హాలీవుడ్ సినిమాల కంటెంట్‌ అంటే ఎంతో ప్రేమ. ఫార్మేట్, జానర్, భాష… ఏదైనా సరే, కంటెంట్ బాగుంటే వెంటనే నచ్చితే చూసేస్తారు. కానీ చైనా మాత్రం అలాంటి మార్కెట్ కాదు — బయటి దేశాల సినిమాలను పెద్దగా అంగీకరించని ప్రేక్షకులు అక్కడ. అయితే ఇప్పుడు అంచనాలు, రూల్స్ అన్నీ చెరిపేస్తూ… హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక యానిమేటెడ్ ఫిల్మ్ చైనాలో సంచలన రికార్డులు క్రియేట్ చేస్తోంది. అదే Zootopia 2.

గ్లోబల్ బాక్సాఫీస్‌లో ఓపెనింగ్ వీకెండ్‌కి ఈ మూవీ వసూళ్లు $556 మిలియన్ సాధించింది. ఒక్క చైనా మార్కెట్‌లోనే సినిమా ఒకే రోజు చేసిన గ్రాస్ కలెక్షన్ ₹925 కోట్లు+! దాదాపు $150M బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ఇప్పటివరకు తీసిన యానిమేటెడ్ చిత్రాల్లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు—చైనాలో హాలీవుడ్ సినిమా ఓపెనింగ్ వీకెండ్ రికార్డ్‌ను కూడా బ్రేక్ చేసింది.

విడుదలైన నాలుగు రోజుల్లోనే Zootopia 2 మొత్తం $200 మిలియన్ గ్రాస్ అందుకుంది. చైనా మార్కెట్‌లో ఇంత వేగంగా వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ చిత్రాలలో ఇది టాప్‌లో స్థానం సంపాదించుకుంది.

అయితే ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్‌లో పెద్ద డౌట్ ఏంటంటే… లైవ్-యాక్షన్ కమర్షియల్ సినిమాలను వదిలి, యానిమేటెడ్ మూవీ ఎందుకు ఇంత పెద్దగా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది? సాధారణంగా యానిమేషన్‌కి టార్గెట్ ఆడియన్స్ చాలా చిన్నది. ఇంకా ముఖ్యంగా చైనా మార్కెట్ యానిమేటెడ్ సినిమాలపై ఇంత రిసెప్షన్ చూపడం చాలా అరుదు. కానీ ఇప్పుడు ఇవన్నీ తలకిందులు అవుతున్నాయి; కొత్త రికార్డులు సెట్ అవుతున్నాయి.

సినిమా కథ: డిటెక్టివ్‌లు జూడీ హాప్స్ ఇంకా నిక్ వైల్డ్‌లు… మమ్మల్స్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఓ మిస్టీరియస్ రెప్టైల్‌ని చేధించేందుకు కొత్త ప్రాంతాల్లో అండర్‌కవర్‌గా వెళ్లే థ్రిల్లింగ్ జ‌ర్నీ. ఈ కేసు వీరిద్దరి భాగస్వామ్యాన్ని ఎన్నడూ లేని విధంగా పరీక్షిస్తుంది.

ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే, చైనా మార్కెట్‌కి మరిన్ని యానిమేటెడ్ సినిమాలు వచ్చి… ప్రపంచవ్యాప్తంగా యానిమేషన్ సినిమాల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *