మనిషి అభివృద్ధి చెందాడు అంటే దానికి ప్రధాన కారణం తెలుసుకోవాలనే జిజ్ఞాసే. తనకు తెలియని వాటి గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే ఇప్పటి వరకు నాగరికతను అభివృద్ధి చెందించుకుంటూ వచ్చాడు. ఈ ఆధునిక మనిషి తన భవిష్యత్తు కంటే తన భూతకాలంలో ఏం జరిగింది… తానున్న చోట కాకుండా ఎక్కడో దూరాన ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఉత్సాహం చూపుతాడు. ఇక ప్యారిస్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఈఫిల్ టవర్, ఫ్యాషన్ రంగం. ఈ రెండూ ఆ నగరాన్ని ఉన్నత శిఖరానికి చేర్చాయి. టూరిస్టులను ఆకర్షించేది కూడా ఈ రెండే. అయితే, పూర్వం రోజుల్లో అంటే 1900 నుంచి 1950 మధ్యకాలంలో అసలు ప్యారిస్ వీధుల్లో ఏం జరిగేది. ఆయా వీధుల్లో మనుషులు ఎలా ఉండేవారు… అప్పటి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి… అదేవిధంగా, ప్యారిస్ నరగంలో రెస్టారెంట్‌కు వెళ్లే మనుషులు ఎలా అలంకరించుకొని వెళ్లేవారు అనే విషయాలు తెలుసుకోవాలని అనుకోవడం సహజమే. వాటినే మీకు ఇక్కడ చెప్పబోతున్నాం.
ఫారిన్ అంటే సూటు,బూటు, హ్యాటు కామన్. 1920లో ప్యారిస్‌లో ఇదొక ఫ్యాషన్. కొత్తదనం కోసం ఉవ్విళ్లూరే రోజులు కావడంతో ప్రతి ఒక్కరూ తమ అప్పీరియన్స్‌తో న్యూలుక్‌తో కనిపించాలని ప్రయత్నించేవారు. వేసుకునే దుస్తుల నుంచి తీసుకునే ఆహారం వరకు అన్నీ కొత్తగా ఉండాలని అనుకుంటారు. ఆరోజుల్లోనే స్ట్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక రెస్టారెంట్‌కి ఫుడ్ కంటే కూడా సాఫ్ట్ డ్రింక్స్, టీ, కాఫీ తాగేందుకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువ. ఇక ఫ్యాషన్ నగరంగా పేరు గాంచిన ప్యారిస్‌లో ఆరోజుల్లోనే మహిళల షోకులను వర్ణించలేం. గ్లామర్‌కు మేకప్‌టచ్ ఇస్తూ దేవతలే దిగివచ్చారా అన్నట్టుగా కనిపిస్తూ కనువిందు చేస్తుంటారు. ఇవే కాదు ప్యారిస్ వీథుల్లో ఇంకా ఎన్నో దృశ్యాలు మనకు కనువిందు చేస్తుంటాయి. కావాలంటే మీరు ఈ వీడియోని ఓ లుక్కేయండి.