ఆఫ్రికాలోని అడవుల్లో నివశించే సింహాలు యమా డేంజర్. ఒక్క సింహాలే కాదు… అక్కడ నివశించే ప్రతి కౄరజంతువూ డేంజరే. ఇలాంటి చోటే ఎక్కువగా పర్యాటకులు వాటిని చూసేందుకు వస్తారు. వారికోసం పర్యాటకులు, అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి సఫారీలోకి తీసుకెళ్తారు. అయితే, ఒక్కోసారి సింహాలు, పులులు, చిరుతలు పర్యాటకుల వాహనాల వద్దకు వస్తాయి. కానీ, ఈ వీడియో చూపిన విధంగా ఇలా ముఖంలో ముఖంపెట్టి చూడవు. ఒకవేళ అలా చూస్తే… ఆరోజుతోనే ఆఖరు అనుకోవాల్సిందే. ఎందుకంటే అవి అంత ముందుకు వచ్చి చూస్తే మన గుండెలు జారిపోతాయి.
ఓ సింహం సఫారీలో ఆగిఉన్న వ్యాన్ వద్దకు వస్తుంది. రెండుకాళ్లను వ్యాన్ పై ఉంచి అందులో ఉన్న పర్యాటకురాలి ముఖంలో ముఖంపెట్టి చూస్తుంది. అయితే, ఆమెకూడా అలానే కళ్లు ఆర్పకుండా చూడటంతో… ఓ నిమిషం తరువాత ఒక్క అంగలో వెనక్కి దూకి వెళ్లిపోతుంది. అలా వెనక్కి దూకినపుడు…పర్యాటకురాలు అదిరిపడుతుంది. తృటిలో మరణం నుంచి తప్పించుకున్నట్టుగా ఆ పర్యాటకురాలు చెప్పడం విశేషం. ఏదిఏమైనా ఇలాంటి అరుదైన దృశ్యాలు చూడాలన్నా, అనుభవించాలన్నా ఆఫ్రికా వరకు వెళ్లాల్సిందే.