దీపావళి వస్తుంది అంటే స్వీట్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు మిఠాయి దుకాణదారులు. ఇందులో భాగంగానే జైపూర్‌కు చెందిన ఓ ప్రసిద్ధ దుకాణం బంగారం కలిపిన స్వీట్‌ను విక్రయిస్తున్నారు. స్వర్ణభస్మ పేరుతో బంగారు భస్మంతో తయారు చేసిన అరుదైన ఆయుద్వేద మిఠాయిగా చెబుతున్నారు. ప్రధానంగా రాజవంశీయులు, మహారాజులు తినే ప్రాచీన ఆరోగ్య రక్షణ రసాయనంగా స్వర్ణభస్మను వేదశాస్త్రాల్లో గుర్తింపు పొందింది. శరీరానికి రోగ నిరోధక శక్తి పెంచడానికీ, మేధస్సును పదును పెట్టడానికీ, దీర్ఘాయుష్షుని ప్రసాదిస్తుందనే విశ్వాసం.
30లో ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి?
ఈ మిఠాయి ఖరీదు వినగానే షాక్ అవ్వాల్సిందే. ఈ స్వీట్ ధర అక్షరాల లక్షరూపాయలు. దుకాణం యజమాని తెలిపిన వివరాల ప్రకారం, ఇది సాధారణ డెజర్ట్ కాదు, “మిఠాయి రూపంలో ఔషధం”. తయారీలో పవిత్ర నెయ్యి, అరుదైన కుంకుమపువ్వు, తేనె, నేచురల్ గంధ ద్రవ్యాలు, ముఖ్యంగా శుద్ధమైన స్వర్ణభస్మను నియమానుసారంగా మిక్స్ చేసి తయారు చేసినట్టుగా చెబుతున్నారు.
వీటిని ప్రత్యేక సందర్భాల కోసం, మహారాజ స్థాయి కానుకలుగా కొనుగోలు చేసే వారే ఎక్కువ. “ఓన్లీ ఫర్ క్లాసిక్ లగ్జరీ క్లయింట్స్” అంటూ ప్రైవేట్‌గా విక్రయిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్, ఢిల్లీ, ముంబై బిజినెస్ ఎలైట్ సర్కిల్స్ నుంచి ఆర్డర్స్ వరుసగా వస్తున్నాయట.
ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొందరు ఇది ఆరోగ్య రక్షణ సంప్రదాయానికి గౌరవమని చెప్పగా, మరికొందరు ఇది లగ్జరీ ఆడంబరమని ప్రశ్నిస్తున్నారు