చేస్తున్న వృత్తిని ధైవంగా భావించినవారు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయరు. కష్టాలను ఓర్చుకుంటూ, కన్నీటిని దాచుకుంటూ ఒక్కోమెట్టు ఎక్కి ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. చేస్తున్న వృత్తి చిన్నదా పెద్దదా అని కాదు… ఏ వృత్తిలో అయినా గుర్తింపు రావాలంటే ఇష్టంగా పనిచేయాలి. 51 సంవత్సరాల వయసులోనూ ఇష్టమైన పనిని కష్టం అనుకోకుండా కొండలు ఎక్కి మరి తన ధర్మాన్ని నిర్వర్తించింది మణిపూర్‌కు చెందిన ఆశావర్కర్ ప్రిన్మయి. ఆశావర్కర్లకు జీతాలు ఎంత ఉంటామో మనందరికీ తెలుసు. వారికి పెద్దగా గుర్తింపు ఉండదు. కానీ, పిల్లల్ని కాపాడంతో వారే ముఖ్యం.
ఆరోగ్యసూత్రాలను పాటింపచేయడంలో ముందుంటారు. ఎప్పటికప్పుడు పిల్లలకు వ్యాక్సిన్లు అందిస్తూ తల్లిబిడ్డలను కాపాడుతుంటారు. ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించగా ప్రిన్మయి తన గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ పోలియో చుక్కలు వేశారు. అయితే, అట్టంగ్‌ఖునౌ, అట్టంగ్‌ఖుల్లెన్ అనే ఈ రెండు గ్రామాలకు వెళ్లాలి అంటే కొండలు ఎక్కాల్సిందే. దాదాపు 28 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటలపాటు కాలినడన వెళ్లి ప్రిన్మయి పోలీయో చుక్కులు వేశారు. స్వయంగా ఆ రాష్ట్ర గవర్నరే ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.