బతకడం కోసం ఏ పనిచేసినా తప్పులేదు. తప్పుకాని ఏ పని అయినా గొప్పదే. 70 ఏళ్లుగా గ్రామంలోని మహిళలు ఎంచుకున్న పనికి ఇప్పుడు ఏకంగా గుడిపై శిల్పాల రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం వచ్చింది. పనికి గుర్తింపుగా భగవంతుడు కొలువైన ఆలయంలో తమకు స్థానం లభించడం ఆనందంగా ఉందని అంటున్నారు మహిళలు. తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లాలో 70 ఏళ్ల క్రితం వచ్చిన తీవ్రమైన కరువు కారణంగా… పనులు దొరక్కపోవడంతో చాలా మంది బీడీలు తయారు చేసే వృత్తిని ఎంచుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి బీడీ ఆకులు తీసుకొచ్చి వాటిని బీడీలుగా తయారు చేస్తుంటారు. దీని వలన దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని తెలిసినా కుటుంబం కోసం తప్పడం లేదని అంటున్నారు. గతంలో ఇలా బీడీలు తయారు చేసేవారి సంఖ్య 7 లక్షల ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య సగానికి తగ్గిపోయింది.
పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మరో సంచలనం… టాప్‌లిస్ట్‌లో షోగర్ల్
వీరిని గుర్తించేందుకు జిల్లాలోని ఆలంగులం గ్రామస్తులు ముందుకు వచ్చారు. గ్రామంలో నిర్మిస్తున్న ఆలయంపై మహిళలు బీడీలు చుడుతున్న శిల్పాలు, బీడి ఆకులను ఎండబెడుతున్న శిల్పాలను చెక్కించారు. ఆలయంపై చెక్కే దేవతా శిల్పాలు మనిషి అంతరంగాన్ని మార్చే విధంగా ఉంటే, ఆలంగులంలోని ఆలయం విగ్రహాలు పనికి గుర్తింపుగా ఉండటం విశేషం. ఈ విగ్రహాలు భవిష్యత్ తరాలకు తమ జీవనోధారమైన వృత్తిని పరిచయం చేస్తాయి.
వేదకాలంలో అప్పటి వృత్తులను అనుసరించిన శిల్పాలు పలు దేవాలయాలపై మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసినపుడు ఆనాటి కాలంలో ఎటువంటి వృత్తులు ఉండేవి, ఎటువంటి పనులు చేసుకునేవారు అను విషయాలపై అవగాహన కలుగుతుంది. వాటి ఆధారంగానే ఆనాటి జీవినవిధానం అంచనా వేయగలం. ఇప్పుడు ఇటువంటి శిల్పాల ద్వారా రాబోయే భవిష్యత్తులో బీడీ కార్మికులు ఉండేవారని, వారు తమ జీవితాలను త్యాగం చేసి బీడీ తయారీ చేసేవారని, దాని వలన పడిన ఇబ్బందులు వచ్చే జబ్బులు, బాధలు అన్నింటిని భవిష్యత్ తరాలవారు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఆలంగులం గ్రామస్తులు చేసిన ఈ ఆలోచన అద్భుతం అని చెప్పాలి. ప్రజలు బాధలను, వారి వృత్తులను, కష్టాలను ఇలా శిల్పాల రూపంలో ఆలయాలపై ప్రవేశపెడితే ఆ భగవంతుడు కూడా కొంత సంతోషిస్తాడు. బాధపడుతున్నవారిని గురించి తెలుసుకోవడం ఆయనకు కూడా కొంత సులభం అవుతుంది.