హెచ్1బి వీసాలపై ట్రంప్ కొట్టిన దెబ్బ తిరిగి రివర్స్ అయితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. హెచ్ 1 బి వీసా ఫీజును ట్రంప్ ప్రభుత్వం ఏకంగా లక్ష డాలర్లకు పెంచింది. అదీ ఒక్కసారికి కాదు, రెన్యువల్ చేయించుకున్న ప్రతిసారి ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందే. దీంతో ఐటీ కంపెనీలు షాక్ తిన్నాయి. నాణ్యమైన నిపుణులను తక్కువ మొత్తానికి అమెరికాకు దిగుమతి చేసుకొని కంపెనీలో ఉద్యోగులుగా నియమించుకునేవి. కానీ, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతీయ టెక్ నిపుణులు అమెరికా వదిలి ఇండియా వచ్చేస్తారు. 2030 నాటికి ఇండియా అభివృద్ధి పధంలో దూసుకెళ్తుంది.
రూపాయి రేటు భారీగా పెరుగుతుంది. డాలర్ రేటు తగ్గిపోతుంది. దేశంలోని చిన్న చిన్ననగరాల్లోనూ ఎయిర్‌పోర్టులో అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాల కోసం విదేశీయులు భారత్‌కు క్యూకడతారు. భారత్‌తో విదేశీయులు బెగ్గింగ్ చేస్తుంటారు. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చి వాళ్లు భారత్‌లో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తుంటారు. ఇదంతా చూస్తుంటే రెండు కళ్లు చాలవు. నిజంగా ఇది నిజమైతే అంతకన్నా కావలసింది ఏముంటుంది.