చరాచర జగత్తులో మనమంతా ఒక భాగం. ప్రకృతి ధర్మాలకు లోబడి మనుగడ సాగించాలి. మనిషికి ఇచ్చిన తెలివిని మంచి పనులు చేసేందుకు, ప్రకృతి నియమాలు, వాటి సూత్రాలకు కట్టుబడి ఉపయోగించాలి. అయితే, ఈ ప్రపంచంలో మూడొతుల నీరు ఉండగా ఒక వంతు మాత్రమే భూమి ఉంది. అందులోనూ, నదులు, పర్వతాలు, అడవులు పోగా మనుషులు నివశించడానికి అవసరమైన భూమి చాలా తక్కువ. వేటినైనా పెంచుకోవచ్చుగాని, భూమిని పెంచుకోలేం కదా. అలాగని, ప్రకృతిలో భాగమైన అడవులను నరికేస్తూ, కొండలను పిండిచేస్తూ, పర్వతాలను తొలగిస్తూ నేలను చదును చేసుకుంటూ పోతే… భారీ వర్షాలు కురిసిన సమకంలో ఎక్కడా లేని విధంగా వరదలు సంభవిస్తాయి. వరదలకు వారు వీరు అనే తేడా ఉండదు. కులం మతం చూడదు, చిన్నా పెద్దా ఆలోచించదు. తనకు అడ్డుగా ఉన్నవాటిని తోసుకుంటూ ముందుకు వెళ్తుంది.
దీనికో చిన్న ఉదాహరణ ఇప్పుడు మనం చూస్తున్న వీడియో. పెద్ద వరద ఇళ్లను సైతం తనలో కలిపేసుకుంటూ తనతో తోసుకొని ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఇలాంటి చూసినపుడు మనం భయపడిపోతాం. బాధపడతాం. ఆ తరువాత షరా మామూలే అవుతాం. అలా కాకుండా ఆలోచించి, అందరికీ ఉపయోగపడే ఓ మంచి నిర్ణయం తీసుకొని, ప్రకృతిని కాపాడుకునేందుకు మనవంతు కృషి చేస్తే బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మీకేమి అనిపిస్తుందో కామెంట్ చేయండి.