రాశిఫలాలు – జూన్ 6, 2025, శుక్రవారం

Daily Horoscope – June 6, 2025: Friday Zodiac Predictions for All Signs

మేషరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. కొద్దిపాటి ఆందోళనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు సాయంత్రం వరకు మీరు మీ పనులతో బిజీగా ఉంటారు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలి. శాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆర్ధికంగా ఈరోజు బాగుంటుంది. ఈరోజు ఈరాశివారు నారింజ రంగు దుస్తులు ధరించాలి. శ్రీమహాలక్ష్మిని ఆరాధించడం శ్రేయస్కరం.


వృషభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు పసుపు రంగు దుస్తులు ధరించాలి. శ్రీవేంకటేశ్వరుని ఆరాధన శ్రేయస్కరం.


మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు. నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉపాధి రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఈరాశివారు ఇటుకరంగు దుస్తులు ధరించాలి. పార్వతీదేవి ఆరాధన శుభప్రదం.


కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వివాహాది మహోత్సవాల్లో పాల్గొంటారు. కీలక పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఈరోజు ఈరాశివారు జేగురు రంగు దుస్తులు ధరించాలి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మంచిది.


సింహరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న ప్రణాళికలను ముందుకు సాగేలా ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈరోజు ఈరాశివారు ముదురు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. గాయత్రీదేవి ఆరాధన శుభప్రదం.


కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు ముందుగా సిద్ధం చేసుకున్న పనులను విజయవంతంగా కొనసాగిస్తారు. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి. ఈరోజు ఈరాశివారు తెలుపు రంగు దుస్తులు ధరించాలి. గురువులను ఆరాధించడం శుభప్రదం.


తులారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఈరోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. సరదా కోసం ప్రయాణాలు చేస్తారు. ప్రేమికుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈరోజు ఈరాశివారు ఎరుపురంగు దుస్తులు ధరించాలి. ఇష్టదైవారాధన చేయడం మంచిది.


వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే, ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు పరిష్కారాలను కనుగొనే ప్రయత్నంలో సఫలం అవుతారు. ప్రణాళికలను అమలు చేస్తారు. కుటుంబంలోని సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తారు. ఈరోజు ఈరాశివారు నీలం రంగు దుస్తులు ధరించాలి. గణపతి ఆరాధన శుభప్రదం.


ధనురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ రంగంలోని వారికి కలిసి వస్తుంది. నూతన పరిచయాలు మీకు అనుకూలంగా మారతాయి. విద్యార్ధులు చదువులో రాణిస్తారు. ఉపాధ్యాయులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఈరోజు ఈరాశివారు పసుపు ఎరుపు మిళితమైన రంగు దుస్తులు ధరించాలి. శ్రీకృష్ణ భగవానుడి ఆరాధన చేయడం మంచిది.


మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉంది. ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీ చుట్టూ ఉన్న శతృవులను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఈరోజు ఈరాశివారు ఊదారంగు దుస్తులు ధరించాలి. సూర్యుని ఆరాధన శుభప్రదం.


కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సృజనాత్మక ఆలోచనలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. అయితే, భావోద్వేగాలను నియత్రించుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు ముదురునీలం రంగు దుస్తులు ధరించాలి. శ్రీమహావిష్ణువు ఆరాధన శుభప్రదం.


మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సిన సమయం. ఈరోజు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు తెలుపురంగు దుస్తులు ధరించాలి. మహాశివుడి ఆరాధన చేయడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *